Mon Dec 23 2024 16:32:36 GMT+0000 (Coordinated Universal Time)
డీజే టిల్లు సీక్వెల్ పై అదిరే అప్డేట్ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ
అనుపమ స్థానంలో మరో బ్యూటీ మడోనా సెబాస్టియన్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు టాక్. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి హీరో ..
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకి 'డీజే టిల్లు' సినిమా బ్రేక్ ఇచ్చింది. అంతకుముందు చేసినా సినిమాల్లో సిద్దుకి పెద్దగా పేరు రాలేదు కానీ.. డీజే టిల్లులో చేసింది అతనా అనిపించేలా చేశాడు సిద్దు. 'అట్లుంటది మనతోని' అంటూ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు ఈ హీరో. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాతో మరోసారి డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు తొలుత అనుపమను సెలెక్ట్ చేయగా.. ఆమె మధ్యలో వెళ్లిపోయినట్లు వార్తలొచ్చాయి. అందులో నిజమెంతో తెలీదుగానీ.. అనుపమ స్థానంలో మరో బ్యూటీ మడోనా సెబాస్టియన్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు టాక్. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి హీరో ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, మార్చి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నట్లుగా సిద్ధూ ట్వీట్ చేశాడు. త్వరలోనే ఓ అదిరిపోయే అప్డేట్తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తామని సిద్ధు ఈ సందర్భంగా తెలిపాడు.
Next Story