Thu Dec 19 2024 17:08:29 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప 2 అప్డేట్ ఇదిగో.. పుష్పరాజ్ ఎక్కడ ?
తిరుపతి జైలు నుంచి బులెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప అంటూ మొదలయింది గ్లింప్స్. పుష్ప ఎక్కడ అంటూ మీడియా..
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో 2021లో వచ్చిన పుష్ప-1 ఊహించని విజయాన్ని అందుకుని.. రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. పుష్ప ది రూల్ పై భారీ అంచనాలున్నాయి. పుష్ప పార్ట్ 1 వచ్చి దాదాపు ఏడాదిన్నర పూర్తయింది. ఇంతవరకూ పార్ట్ 2 పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో.. అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
మొత్తానికి వారి ఎదురుచూపులకు తెరపడింది. ఇక అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామంటూ తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈరోజు సినిమా నుంచి ఊహించని అప్డేట్ ఇచ్చింది టీమ్. పుష్ప-2 నుండి పవర్ వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. తిరుపతి జైలు నుంచి బులెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప అంటూ మొదలయింది గ్లింప్స్. పుష్ప ఎక్కడ అంటూ మీడియా అండ్ పోలీస్ లు వెతుకుతుంటే.. పుష్ప ని ఏం చేశారంటూ ప్రజలు ధర్నాలు చేస్తున్న విజువల్స్ ను వీడియో గ్లింప్స్ లో చూపించారు. ఈ గ్లింప్స్ ను బట్టి చూస్తే.. భన్వర్ సింగ్ షేఖావత్ (ఫహద్ ఫాసిల్) పుష్పని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7 సాయంత్రం 4.05 నిమిషాలకే మరో అప్డేట్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. పార్ట్ 2 లోనూ రష్మికనే హీరోయిన్. ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. మైత్రీమూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Next Story