Thu Jan 09 2025 19:51:01 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి పీటలు ఎక్కేసిన తెలుగు సింగర్, తమిళ్ హీరోయిన్..
తమిళ్ హీరోయిన్, తెలుగు స్టార్ సింగర్.. ఏడడుగులు వేసి తమ మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసేసారు.
ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే సినిమా పరిశ్రమలో పెళ్లిసందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరి తర్వాత ఒకరు ఏడడుగులు వేస్తూ వస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కృతికర్బందా, మీరా చోప్రా, నటాషా దోషి, అక్షా పార్ధసాని.. ఇలా అందాల భామలంతా వరుసగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. తాజాగా తమిళ్ హీరోయిన్, తెలుగు స్టార్ సింగర్ కూడా మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసేసారు.
ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, ఆచార్య వంటి సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన స్టార్ సింగర్ 'హారిక నారాయణ్' (Harika Narayan).. తన ఏడేళ్ల ప్రేమని పెళ్లి జీవితంగా మార్చుకుంటూ ఏడడుగులు వేశారు. ఇటీవలే తన ప్రియుడు 'పృధ్విరాజ్ పెంపటి'తో నిశ్చితార్థం జరుపుకున్న హారిక.. తాజాగా అతనితో తన మెడలో మూడు ముళ్ళు వేయించుకొని మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేశారు. కాగా ఈ స్టార్ సింగర్ పెళ్లిలో టాలీవుడ్ కి సంబంధించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు సింగర్స్ పాల్గొని కొత్త జంటని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక తమిళ్ హీరోయిన్ విషయానికి వస్తే.. 'గుడ్ నైట్' వంటి ఫీల్ గుడ్ సినిమాతో తెలుగు అబ్బాయిల మనసు దోచుకున్న 'మీతా రఘునాథ్' కూడా తన ప్రియుడుతో మూడు ముళ్ళు వేయించుకున్నారు. 'ముదల్ నీ ముడివుం నీ', 'గుడ్ నైట్' సినిమాలతో మీతా.. అటు తమిళం ఇటు తెలుగు యూత్‌లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఈమెను మరిన్ని సినిమాల్లో చూడాలని వారంతా ఎదురు చూస్తుంటే.. మీతా మాత్రం గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. తాజాగా ఎటువంటి హడావుడి లేకుండా పెళ్లి వేడుకను కూడా జరిపేసుకున్నారు. తన వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలను మీతా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Next Story