Mon Dec 23 2024 19:02:28 GMT+0000 (Coordinated Universal Time)
రెండో పెళ్లికి సిద్ధమైన నాగచైతన్య ? మళ్లీ హీరోయిన్ తో నేనా ?
అఖిల్ కోసం అమ్మాయిని వెతికే పనిలో నాగ్ ఉన్నట్లు టాక్. మరోవైపు నాగచైతన్య మళ్లీ ఓ హీరోయిన్ తో ప్రేమలో పడినట్లు టాలీవుడ్..
హైదరాబాద్ : టాలీవుడ్ హీరో, నాగార్జున కొడుకు నాగచైతన్య గతేడాది అక్టోబర్ లో సమంతతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఇప్పటి వరకూ వీరి విడాకుల ఇష్యూపై సోషల్ మీడియాలో ఏదోక డిస్కర్షన్ జరుగుతూనే ఉంది. తాజాగా.. నాగచైతన్య రెండో పెళ్లిపై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాదిలోనే చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అఖిల్ , చైతన్య .. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నాగర్జున డిసైడ్ అయ్యారట.
అఖిల్ కోసం అమ్మాయిని వెతికే పనిలో నాగ్ ఉన్నట్లు టాక్. మరోవైపు నాగచైతన్య మళ్లీ ఓ హీరోయిన్ తో ప్రేమలో పడినట్లు టాలీవుడ్ గుసగుసలాడుతోంది. ఈ విషయం నాగ్ వరకూ వెళ్లిందని, చైతన్య లవ్ ను కన్ఫర్మ్ చేసేస్తే అఖిల్ తో పాటు అతనికి కూడా పెళ్లి చేసేస్తానని నాగార్జున అంటున్నారని గాసిప్. అయితే ఈ విషయాన్ని నాగ్ కుటుంబ సన్నిహితులు ఖండిస్తున్నారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని, చైతన్య - అఖిల్ లు తమ కెరీర్స్ పై ఫోకర్స్ పెట్టారని, ఇప్పట్లో పెళ్లి టాపిక్ లేదని చెప్తున్నారు. బంగార్రాజు తర్వాత నాగచైతన్య థ్యాంక్యూ మూవీతో రానుండగా.. అఖిల్ ఏజెంట్ మూవీ చేస్తున్నాడు.
Next Story