వచ్చే వారం సిత్రాలు!
ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కామెడీ ఎంటర్టైనర్ గా జాతి రత్నాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోగగా.. శర్వానంద్ శ్రీకారం, శ్రీ విష్ణు [more]
ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కామెడీ ఎంటర్టైనర్ గా జాతి రత్నాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోగగా.. శర్వానంద్ శ్రీకారం, శ్రీ విష్ణు [more]
ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కామెడీ ఎంటర్టైనర్ గా జాతి రత్నాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోగగా.. శర్వానంద్ శ్రీకారం, శ్రీ విష్ణు గాలి సంపత్ లకి మిక్స్డ్ టాక్ పడింది. ఇక వారం వారం సినిమాల జాతర అన్నట్టుగా వచ్చే వారం ఎప్పటిలాగే థియేటర్స్ లోకి మూడు సినిమాలు దిగబోతున్నాయి. అందులో ఆది సాయి కుమార్ శశి మూవీ, మంచు విష్ణు మోసగాళ్లు, కార్తికేయ చావుకబురు చల్లగా సినిమాలు ఉన్నాయి. హీరోగా మంచి సక్సెస్ కోసం ఎప్పటినుండి ఎదురు చూస్తున్న ఆది సాయి కుమార్ లవ్ స్టోరీ తో శశి గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పవర్ స్టార్ చేతుల మీదుగా విడుదలైన శశి ట్రైలర్ చూస్తే సినిమా మీద హోప్స్ పెట్టుకోవచ్చని అనిపిస్తుంది. హీరోగా స్ట్రగుల్స్ లో ఉన్న ఆది సాయి కుమార్ కి ఈ సినిమా హిట్ కంపల్సిరి.
ఇక కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు విష్ణు పాన్ ఇండియా లాంటి ఫిలిం మోసగాళ్లు కూడా వచ్చే శుక్రవారమే విడుదల కాబోతుంది. మంచు విష్ణు – టాప్ హీరోయిన్, గ్లామర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అన్నా చెల్లెళ్లుగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. నాలుగు భాషల్లో విడుదల కాబోతున్న మోసగాళ్లు పై ప్రేక్షకుల్లో పెద్దగా క్యూరియాసిటీ కనిపించడం లేదు. అందుకే హీరోయిన్ కాజల్ ని హైలెట్ చేస్తూ సినిమా చూపించే ప్రయత్నాల్లో టీం ఉంది. RX 100 తో హీరోగా మారిన కార్తికేయ – లావణ్య త్రిపాఠిల చావు కబురు చల్లగా సినిమాపై మర్కెట్ లో క్రేజ్ ఉంది. కారణం బన్నీ వాస్, గీత ఆర్ట్స్ లాంటి వారు ఆ సినిమా బ్యాక్ బోన్స్ గా ఉన్నారు. అల్లు అర్జున్ చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా చూసా.. స్కిప్ట్ బావుంది అంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేసాడు. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ తీరానికి చేరుతుందో వేచి చూద్దాం.
- Tags
- Movies next week