ఇస్మార్ట్ భామ కొచ్చిందో.. ఛాన్స్
ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ఆ సినిమాలో నటించిన హీరోయిన్స్ నాభ నటాషా, నిధి అగర్వాల్ తల రాత మారిపోతుంది. ఇంక వాళ్ళు టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో [more]
ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ఆ సినిమాలో నటించిన హీరోయిన్స్ నాభ నటాషా, నిధి అగర్వాల్ తల రాత మారిపోతుంది. ఇంక వాళ్ళు టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో [more]
ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ఆ సినిమాలో నటించిన హీరోయిన్స్ నాభ నటాషా, నిధి అగర్వాల్ తల రాత మారిపోతుంది. ఇంక వాళ్ళు టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో కెళ్తారన్నారు. అన్నట్టుగానే వారిద్దరూ తమ రెమ్యునరేషన్ డబుల్ చేసారనే టాక్ కూడా నడిచిందని. అయితే ఇస్మార్ట్ విడుదలై 50 రోజులైనా.. నాభ నటాషా రవితేజ డిస్కో రాజా షూటింగ్ లో ఉంటే.. నిధి మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. తాజాగా నాభ నటాషా కి అఖిల్ సినిమాలో ఛాన్స్ అంటూ న్యూస్ వినబడుతుంది.
నిధికి ఛాన్స్ దక్కేనా…?
మరోపక్క నిధి అగర్వాల్ కి కూడా మరో ఛాన్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల ప్లాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టిన నిధిగా గర్వాల్ కి మెగా హీరో సినిమాలో ఛాన్స్ వచ్చిందట. సాయిధరమ్ తేజ్ హీరోగా.. సుబ్బు అనే కొత్త దర్శకుడి డైరెక్షన్ లో బివిఎన్ ప్రసాద్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాలో నిధిని సాయి ధరమ్ కి జోడిగా ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇక ఆ సినిమాలో మరో హిరోయిన్ కూడా ఉంటుందట. ప్రస్తుతానికైతే సెకండ్ హిరోయిన్ సంచారమేమి లేదు. మరి ఈ ఆఫర్ అయినా నిధి సద్వినియోగం చేసుకుని హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందో.. లేదో.. చూడాలి.