Mon Dec 23 2024 08:00:54 GMT+0000 (Coordinated Universal Time)
తొలిసారి విడాకులపై స్పందించిన నిహారిక, చైతన్య
తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని, దయచేసి ఈ సున్నితమైన విషయంపై మాట్లాడి తమను బాధపెట్టొద్దని..
మెగా డాటర్ నిహారిక - చైతన్య జొన్నలగడ్డ అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు కన్ఫర్మ్ అయింది. నిన్న సాయంత్రం వీరిద్దరూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో కొద్దిరోజుల క్రితం పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్న పేపర్ ఒకటి నెట్టింట వైరల్ అయింది. జూన్ 5న వీరిద్దరికీ విడాకులు మంజూరైనట్లు మరో పేపర్ బయటికొచ్చింది. ఈ నేపథ్యంలో తొలిసారి నిహారిక - చైతన్య తమ విడాకుల అంశంపై ఇన్ స్టా వేదికగా స్పందించారు.
తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని, దయచేసి ఈ సున్నితమైన విషయంపై మాట్లాడి తమను బాధపెట్టొద్దని నిహారిక, చైతన్య కోరారు. తమ వ్యక్తిగత జీవితాలలో ఇద్దరం ప్రైవసీ కోరుకుంటున్నామని, ఈ విషయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. ఇంతకాలం తమకు అండగా నిలిచిన కుటుంబం, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నిహారిక, చైతన్య విడివిడిగా పోస్టులు చేశారు. కాగా.. నిహారిక- చైతన్యల వివాహం 2020 డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ దూరంగా ఉంటున్నారని వార్తలొచ్చినా ఎవరూ స్పందించలేదు. రెండున్నరేళ్లకే నిహారిక-చైతన్య విడిపోవడంతో మెగా అభిమానులను కలచివేసింది.
Next Story