అంతా అన్న డైరెక్షన్ లోనే అంట!!
మెగా వారి ఫామిలీ లో పెళ్లి అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. శ్రీజ రెండో పెళ్లినే మెగాస్టార్ చిరు ఎలా ఎంత ఆర్భాటంగా చేసి… హైదరాబాద్ [more]
మెగా వారి ఫామిలీ లో పెళ్లి అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. శ్రీజ రెండో పెళ్లినే మెగాస్టార్ చిరు ఎలా ఎంత ఆర్భాటంగా చేసి… హైదరాబాద్ [more]
మెగా వారి ఫామిలీ లో పెళ్లి అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. శ్రీజ రెండో పెళ్లినే మెగాస్టార్ చిరు ఎలా ఎంత ఆర్భాటంగా చేసి… హైదరాబాద్ లో ప్రముఖులకు రిసెప్షన్ ఇచ్చారో అందరూ చూసారు. మరి నాగబాబు కూతురు నిహారిక వెడ్డింగ్ అంటే అందరూ ఓ రేంజ్ లో ఊహించుకోవడం ఖాయం. ఇక ఆగష్టు లో చైతన్య తో నిశ్చితార్ధం చేసుకున్న నిహారిక డిసెంబర్ లో పెళ్లిపీటలెక్కబోతున్నట్టుగా నాగబాబు చెబుతున్నాడు. ఈ ఏడాది చివరిలో నిహారిక పెళ్లి ఉంటుంది అని, అయితే ఇంకా డేట్ ఫిక్స్ చెయ్యలేదని త్వరలోనే డేట్ ఫిక్స్ చేసి అందరికి తెలియజేస్తామని చెబుతున్నాడు. అయితే నిహారిక పెళ్లి హైదరాబాద్ లోనే ఉంటుందా? లేదంటే ఏదైనా డెస్టినేషన్ వెడ్డింగ్ ఆ అనే ప్రశ్నకు నాగబాబు క్లారిటీ ఇచ్చేసాడు.
నిహారిక పెళ్లి పనులను ఆమె అన్న వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకుంటున్నాడని, నిహారిక పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా చేయబోతున్నామని, కరోనా టైం లో మా ఫ్యామిలిలో ఈ శుభ కార్యం కాస్త ఊరటనిచ్చింది అని అంటున్నాడు నాగబాబు. నిహారిక పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండబోతుంది అని…. ఇప్పటికే వరుణ్ తేజ్ నిహారికపెళ్లి కోసం చాలా ప్లేస్ ల లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడని.. అది అందరూ చూసి ఫైనల్ చేయాలంటున్నాడు నాగబాబు. మరి చెల్లెలి పెళ్లి విషయంలో వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ గా పెళ్లి పనులను చూసుకుంటున్నాడన్నమాట. అంటే అన్న చేతుల మీదుగా చెల్లెలి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండబోతుంది అన్నమాట.
- Tags
- Niharika