Mon Dec 23 2024 08:47:04 GMT+0000 (Coordinated Universal Time)
నిఖిల్ తో చెర్రీ పాన్ ఇండియా మూవీ.. ఇదే టైటిల్
కొత్త డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ2, ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మించిన అభిషేక్..
కార్తికేయ 2 సినిమాతో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా పాన్ ఇండియా హీరో అయ్యాడు. వరుస పాన్ ఇండియా చిత్రాలతో నిఖిల్ బిజీ అయ్యాడు. తాజాగా నిఖిల్ మరో పాన్ ఇండియా చిత్రం టైటిల్ పై అనౌన్స్ మెంట్ వచ్చింది. చరణ్ సమర్పకుడిగా.. ఈ భారీ చిత్రం రూపొందుతోంది. వీ మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ 1.35 సెకన్ల నిడివి గల వీడియో విడుదల చేశారు.
స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా చరణ్ టైటిల్, మోషన్ వీడియోను రివీల్ చేశారు. కొత్త డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ2, ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థతో, వీ మెగా పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో "ది ఇండియా హౌజ్" చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారత చరిత్రలో మరచిన అధ్యాయం ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని మోషన్ వీడియోలో చిత్ర బృందం తెలిపింది.
సావర్కర్ జీవితంలోని ఓ భాగాన్ని ఇందులో చూపించనున్నారు. స్వాతంత్య్రోద్యమానికి ముందు 1905లో లండన్ లో జరిగిన సంఘటనలు, విప్లవానికి ఆజ్యం పోసిన ఘటనలను ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. ఇందులో నిఖిల్ శివ పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ శ్యాంజీ కృష్ణ వర్మ పాత్రలో కనిపిస్తారు. కాగా.. నిఖిల్ ప్రస్తుతం ‘స్పై’ చిత్రంలో నటిస్తున్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 29న విడుదల కానుంది.
Next Story