Mon Dec 16 2024 11:05:53 GMT+0000 (Coordinated Universal Time)
Big Boss : బిగ్ బాస్ విజేత నిఖిల్.. ప్రైజ్ మనీ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ నిలిచాడు. మరో కంటెస్టెంట్ గౌతమ్ రన్నరప్ గా మిగిలాడు
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ నిలిచాడు. మరో కంటెస్టెంట్ గౌతమ్ రన్నరప్ గా మిగిలాడు. అందరూ ఊహించినట్లుగానే ఈసారి బిగ్ బాస్ 8 విజేత నిఖిల్ ప్రైజ్ మనీని భారీగా అందుకున్నాడు. యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు మారుతి సుజుకీ డాజ్లింగ్ కారును సొంతం చేసుకున్నాడు. హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రైజ్ మనీని అందుకున్నారు. ఎటువంటి ఉత్కంఠ లేదు. ముందు నుంచి అనుకుంటున్నదే. నిఖిల్, గౌతమ్ ల మధ్య మంచి పోటీ నెలకొంటుందని, చివరకు నిఖిల్ విన్నర్ గా అవుతాడని అందరూ అంచనా వేసుకున్నట్లుగానే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ నిలిచాడు. ఈ ఏడాది సెప్టెంబరు 1న బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయింది.
గత సీజన్ల కు భిన్నంగా...
ఈ సీజన్ గత సీజన్ తో పోలిస్తే భిన్నంగా జరిగింది. నామినేషన్లు, ఎలిమినేషన్లు, కంటెస్టెంట్ల పోరాటాలు, యుద్ధాలు, తిట్టుకోవడాలు, ఘర్షణలు ఇలా ఆసక్తికరంగా సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో చాలా మంది కంటెస్టెంట్స్ ను సీజన్ ప్రారంభమయిన తర్వాత ఐదు వారాల అనంతరం హౌస్ లోకి అడుగు పెట్టారు. నిఖిల్ విన్నర్ గా గెలవడానికి, గౌతమ్ రన్నరప్ గా నిలబడటానికి అదే కారణమని చెబుతున్నారు. పదిహేను వారాలు హౌస్ లో ఉన్న నిఖిల్ ఇటు బిగ్ పాస్ ఇచ్చే ప్రతి టాస్క్ లోనూ విజేతగా ముందున్నాడు. తన జట్టును నడిపించాడు. గౌతమ్ ఐదు వారాల తర్వాత వచ్చినప్పటికీ ఒంటరిగా పోరాడుతూ మంచి మార్కులే సంపాదించుకున్నాడు.
గ్రాండ్ ఫినాలేలో విజేత ఏమన్నారంటే?
అయితే చివరకు నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ లు టాప్ కంటెస్టెంట్లుగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేకు ఎంతో మంతి సెలబ్రిటీలు వచ్చి అలరించారు. ఉపేంద్ర, విజయ్ సేతుపతి, రామ్ చరణ్ వంటి వారిని రప్పించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రైజ్ మనీతో పాటు కప్ ను గెలుచుకున్న నిఖిల్ మాత్రం హౌస్ మేట్స్ తో తన జర్నీ హౌస్ లో అద్భుతంగా సాగిందన్నాడు. తాను బయట వ్యక్తినని చూడకుండా గెలిపించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నిఖిల్ కృతజ్ఞతలు తెలిపాడు. ట్రోఫీని తన తల్లికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు నిఖిల్. రన్నరప్ గా నిలిచిన గౌతమ్ కొంత భావోద్వేగానికి గురైనా తాను కప్ గెలవకున్నా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారని చెప్పారు. బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్న పూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
Next Story