Mon Dec 23 2024 17:15:41 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ 'స్పై','నాయకుడు' సినిమాలు
నిఖిల్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా స్పై.. ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ
నిఖిల్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. భారీ ఎత్తున ఈసినిమాను రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్, సాన్య ఠాకూర్ కథానాయికలుగా చేశారు. మకరంద్ దేశ్ పాండే, అభినవ్ గోమఠం ముఖ్యమైన పాత్రలు పోషించారు. రానా కూడా ఆఖర్లో కనిపించి కనువిందు చేస్తారు. భారీ అంచనాల మధ్య జూన్ 29న థియేటర్లలో విడుదలైన స్పై సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా సినిమా ఫినిషింగ్ బాగాలేదని ఎంతో మంది పెదవి విరిచారు. ఇక ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా గురువారం (జులై 27) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక తమిళ సినిమా 'మామన్నన్' కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేశ్, వడివేలు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 29వ విడుదలైంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 'నాయకుడు' టైటిల్ తో జులై 14వ తేదీన తెలుగులో విడుదల చేశారు. ఇప్పుడు తమిళ, తెలుగు, మలయాళ కన్నడ భాషల్లో 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో థియేటర్స్ కి వచ్చిన రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షం అయింది. మామన్నన్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.
Next Story