Mon Dec 23 2024 09:09:02 GMT+0000 (Coordinated Universal Time)
చరిత్ర ఎప్పుడూ నిజం చెప్పదు.. "స్పై" ట్రైలర్
సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలు చుట్టూ సాగనుందని ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా తెలిపారు.
పాన్ ఇండియా.. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్. పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయితే.. ఆ సక్సెస్ ను కాపాడుకునేందుకు ఆచితూచి అడుగులు వేయాలి. ఇప్పుడు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోలుగా ఎదిగిన వారంతా దానికోసమే ముప్పతిప్పలు పడుతున్నారు. యంగ్ హీరో నిఖిల్ మాత్రం.. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లకు రెడీ అవుతున్నాడు. కార్తికేయ 2 తర్వాత వచ్చిన 18 పేజీస్ కాస్త ఫర్వాలేదనిపించుకుంది. తాజాగా నిఖిల్ ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్ తో రిలీజ్ కు సిద్ధమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో మేకర్స్ స్పై ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా కథ.. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలు చుట్టూ సాగనుందని ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా తెలిపారు. తాజాగా ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. రీసెంట్ గా ఓపెన్ చేసిన హైదరాబాద్ AAA సినిమాస్ లో స్పై ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ను బట్టి చూస్తే.. యాక్షన్ థ్రిల్లర్ లవర్స్ కు ఇది మంచి కిక్ ఇవ్వనుందని తెలుస్తోంది. తన అన్నను చంపిందెవరో తెలుసుకునేందుకు వెళ్లే హీరో.. ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అనే లైన్ పై ట్రైలర్ కట్ చేశారు. చివరిలో రానా ఫ్రేమ్ లో కనిపించి..“స్వతంత్రం అంటే ఎవరో ఇచ్చేది కాదు లాకునేది. ఇది నేను చెప్పింది కాదు నేతాజీ చెప్పింది” అంటూ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. జూన్ 29న స్పై సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
Next Story