Fri Dec 27 2024 08:08:24 GMT+0000 (Coordinated Universal Time)
తన ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన నిక్కీ గల్రానీ
ఆ వార్తలపై కోలీవుడ్ ప్రముఖ నటి నిక్కీ గల్రానీ స్పందించింది. ఆమె గర్భవతి అని.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ
రంగస్థలం సైడ్ హీరో ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ.. ఇటీవల వార్తలు విపరీతంగా వైరలయ్యాయి. ఆ వార్తలపై కోలీవుడ్ ప్రముఖ నటి నిక్కీ గల్రానీ స్పందించింది. ఆమె గర్భవతి అని.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకుు సమాధానమిచ్చారు. అవన్నీ కేవలం రూమర్లేనని.. 'డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి' అంటూ నవ్వుల ఎమోజీని పోస్టు చేశారు. అవన్నీ నమ్మొద్దని, ఏదైనా ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని తెలిపింది.
'కృష్ణాష్టమి', 'మలుపు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిక్కీ.. ఆది పినిశెట్టిని ఈ ఏడాది మే లో వివాహం చేసుకున్నారు. నిక్కీ, ఆది కలిసి 'యగవరయినమ్ నా క్కాక', 'మరగధ నానయమ్' సినిమాల్లో నటించారు. వివాహంతో ఒక్కటి కావడానికి రెండేళ్ల ముందునుండీ వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు.
Next Story