Mon Dec 23 2024 06:28:55 GMT+0000 (Coordinated Universal Time)
Nani - Nithiin : నితిన్ అలా పిలిచినందుకు నానికి వార్నింగ్..
నితిన్ సినిమాకి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు.. నితిన్ అలా పిలిచినందుకు నానికి వార్నింగ్ ఇచ్చారట.
నేచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని స్టార్ చేశారు. స్టార్ డైరెక్టర్స్ బాపు, కె రాఘవేంద్రరావు దగ్గర అక్షరాలను నేర్చుకున్నారు. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సినిమాలో హీరోగా నితిన్ నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సందర్భాన్ని నితిన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అందరితో పంచుకున్నారు.
ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోలను పేరు పెట్టి పిలవకుండా 'బాబు గారు' అని పిలవడం ఆనవాయితీగా ఉండేది. నిర్మాతలు, దర్శకులు ఇలా అందరూ బాబు గారు అనే పిలిచేవారు. అలా కాకుండా పేరు పెట్టి పిలిస్తే అది ఒక నేరంలా చూసేవారు కొంతమంది. అల్లరి బుల్లోడు సమయంలో నితిన్ని నాని పేరు పెట్టి పిలిచేవాడట. అయితే అది గమనించిన నిర్మాత నాని పిలిచి వార్నింగ్ ఇచ్చాడట. పేరు కాదు బాబు అని పిలువు అని చెప్పి మందలిచారట.
అయితే నితిన్ కి 'బాబు' అని పిలిపించుకోవడం ఇష్టం ఉండేది కాదట. అందుకనే నాని పేరు పెట్టి పిలుస్తున్నా ఏం అనేవాడు కాదట. ఆ మూవీ సెట్ లో నాని, నితిన్ ఎక్కువ స్నేహంగా ఉండేవారట. ఇక నిర్మాత ఇచ్చిన వార్నింగ్ తెలుసుకున్న నితిన్, నానికి ఇలా అన్నారట.. "వాళ్ళు అలానే అంటారు. కానీ నువ్వు పేరు పెట్టే పిలువు. పేరు కూడా కాదు అనుకుంటే, ముద్దుగా నిత్ అని పిలువు" అని చెప్పారట.
ఇక నాని కూడా హీరో అయిన దగ్గర నుంచి.. ఇద్దరు ఒకర్ని ఒకరు ముద్దుగా బాబు గారు అని పిలుచుకుంటారట. ప్రస్తుతం ఈ ఇద్దరు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. హీరోగానే కాదు నిర్మాతగా కూడా ఇద్దరు సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నాని ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న, నితిన్ నటించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ డిసెంబర్ 8న రిలీజ్ కాబోతున్నాయి.
Next Story