Mon Dec 23 2024 14:49:46 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ దర్శకుడుని మాత్రమే కాదు టైటిల్ని కూడా.. నితిన్ కొత్త సినిమా!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్.. పవన్ దర్శకుడిని మాత్రమే కాదు టైటిల్ ని కూడా తీసుకోని ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) వరుస సినిమాలు లైన్ పెడుతున్నాడు. ఆల్రెడీ వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే దర్శకుడు వెంకీ కుడుములతో తీయబోయే చిత్రం పనులు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో చిత్రాన్ని పట్టాలు ఎక్కించేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో నేడు ఆగష్టు 27న ఒక చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశాడు.
ఈ సినిమాని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. వేణు గత సినిమా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో చేశాడు. పవన్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన 'వకీల్ సాబ్'ని పవర్ ఫుల్ గా తెరకెక్కించి పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు పవన్ వీరాభిమాని అయిన నితిన్ తో సినిమా తీయడానికి సిద్ధం అయ్యాడు. అదికూడా పవన్ టైటిల్ తోనే రాబోతున్నాడు. పవన్ సూపర్ హిట్ సినిమా 'తమ్ముడు' టైటిల్ ని నితిన్ చిత్రానికి పెట్టాడు.
ఇక ఈ మూవీ లాంచ్ ఈవెంట్ ఫోటోలు షేర్ చేస్తూ నితిన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఇలా రాసుకొచ్చాడు.. "కొన్ని టైటిల్స్ ఎన్నో బాధ్యతలను తీసుకోని వస్తాయి. మేము ఆ అంచనాలకు తగ్గట్టు వస్తాము" అంటూ పేర్కొన్నాడు. నితిన్, పవన్ అభిమాని కావడంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి కూడా మంచి స్పందనే వస్తుంది. మరి నితిన్ ఆ టైటిల్ కి న్యాయం చేస్తాడా? లేదా? చూడాలి.
కాగా ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు గురించి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నితిన్ చేస్తున్న సినిమాలు విషయానికి వస్తే.. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు వెంకీ కుడుముల మూవీ షూటింగ్ లో కూడా పాల్గొనున్నాడు. గతంలో నితిన్ అండ్ వెంకీ కాంబోలో వచ్చిన 'భీష్మ' సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ తరువాత నితిన్ కి ఇప్పటి వరకు మరో హిట్ లేదు.
Next Story