నిత్యా లా బరువు పెరిగితే అవకాశాలెలా వస్తాయ్ పాపా..!
టాలీవుడ్, కోలీవుడ్ లో ట్రెడిషనల్ హీరోయిన్ గా నిత్యా మీనన్ కి మంచి పేరుంది. అమ్మడు బొద్దుగా ఉన్నప్పటికీ.. అస్సలు గ్లామర్ పాత్రలు చెయ్యనప్పటికీ.. మీడియం హీరోల పక్కన మంచి అవకాశాలు కొట్టేసింది నిత్యా. తాజాగా ఆమె పెరిగిన బరువు కారణంగా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఏదో సినిమాలు చేస్తున్నానా.. లేదా అన్నట్టుగా ఆమె కెరీర్ నడుస్తుంది. అయితే నిత్యా మీనన్ గ్లామర్ పాత్రలు చెయ్యకపోయినా ఆమె నటనతో ఆమెకు మంచి పాత్రలే దొరికాయి. కానీ బరువు పెరగడంతో ఆమెకి అవకాశాలు పూర్తిగా పోయాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా నిత్యా మీనన్ లా తయారైంది.
కేవలం నటన మాత్రమే సరిపోతోందా..?
ఎవడే సుబ్రహ్మణ్యం, కల్యాణ వైభోగమే సినిమాలతో ట్రెడిషనల్ అమ్మాయిలా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మాళవిక నాయర్ హీరోయిన్ కి ఉండల్సిన లక్షణాలేమి పెద్దగా లేవు. ఎందుకంటే కాస్త బొద్దుగా... గ్లామర్ లెస్ గర్ల్ గా మాళవిక నాయర్ ఉంటుంది. కేవలం నటనకే అవకాశాలు వస్తాయంటే ఈ రోజుల్లో కుదిరే పని కాదు. గ్లామర్ కి గ్లామర్, నటనకు నటన ఉన్నప్పటికీ... చాలామంది లక్కు లేక హీరోయిన్స్ గా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇక తాజాగా రెండు మూడు సినిమాలతో హీరోయిన్ గా ఉన్న మాళవిక నాయర్ మెగా హీరో కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కిన విజేత సినిమాలో నటించింది. ఆ సినిమాలో హీరోకి ఎదురింటిలో దిగిన అమ్మాయిలా చూడ ముచ్చటగా నటించింది. ఇక హీరో కళ్యాణ్ దేవ్ మాళవిక నాయర్ ని పడేసేలా ప్లాన్స్ చెయ్యడం వంటివి బాగానే ఉన్నాయి. కానీ మాళవిక నాయర్ మాత్రం సినిమాలో లుక్స్ పరంగా అంతగా అనిపించలేదు. ఆమె ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ అన్ని ఓకే కానీ ఆమె పెరిగిన బరువు మాత్రం కాస్త ఎబ్బెట్టుగానే అనిపించింది. అసలు ఆ సినిమాలో మాళవిక కి పెద్దగా స్కోప్ లేని పాత్ర దొరికింది.
బరువు తగ్గాల్సిందే...
మరి నిత్యా మీనన్ లా అలా బరువు పెరుగుతూపొతే.. ఇక సినిమాల్లో హీరోయిన్స్ గా అవకాశాలు ఎలా ఇస్తారు. మరి మాళవిక నాయర్ ఇప్పటికైనా కాస్త ఆలోచించుకుంటే బెటర్ లేదంటే... ఇక చిన్న హీరోల పక్కన కూడా అవకాశాలు దొరకవు. మరి మాళవిక కాస్త ఆలోచించుకోమ్మా ... లేదంటే నిత్యా లాగా కనుమరుగైపోవాల్సిన పరిస్థితి వస్తుంది.