Mon Dec 23 2024 15:54:23 GMT+0000 (Coordinated Universal Time)
తమిళ్ హీరో వేధించాడు.. నిత్యా మీనన్ సీరియస్ పోస్ట్..
ఒక తమిళ్ హీరో తనని వేధించాడు అంటూ నిత్యా మీనన్ నిజంగా చెప్పిందా..? వీటి పై నిత్యా మీనన్ రియాక్షన్ ఏంటి..?
తన యాక్టింగ్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని సౌత్ లోని పలు సూపర్ స్టార్స్ తో వర్క్ చేసిన హీరోయిన్ 'నిత్యా మీనన్' (Nithya Menen). ఇక వివాదాలకు దూరంగా ఉంటూ, చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లే నిత్యా మీనన్.. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తమిళ్ సినీ పరిశ్రమ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. "టాలీవుడ్ సినిమాల్లో నటించినప్పుడు తను ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని. కానీ తమిళ సినిమాల్లో నటిస్తున్నప్పుడు మాత్రం సమస్యలు ఎదురుకున్నట్లు, ఒక తమిళ్ హీరో తనని వేధించినట్లు" నిత్యా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్లు రాసుకొచ్చారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిత్యా మీనన్ తమిళ ఇండస్ట్రీలో.. సూర్య, విజయ్, ధనుష్, రాఘవ లారెన్స్ ఇలా ఆల్మోస్ట్ స్టార్ హీరోలతోనే నటించింది.
దీంతో వీరిలో ఆ హీరో ఎవరని చర్చ మొదలైంది. ఇక ఈ విషయం నిత్యా మీనన్ వరకు చేరుకుంది. వీటిపై నిత్యా మీనన్ రియాక్ట్ అవుతూ.. ఒక సీరియస్ పోస్ట్ వేసింది. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, తను అసలు ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. ఇలాంటి తప్పు వార్తలు రాయకుండా, కొంచెం భాద్యతగా వ్యవహరించండి అంటూ పేర్కొంది. అలాగే అసలు ఈ రూమర్ ఎవరు స్టార్ట్ చేశారో తెలియజేయాలంటూ కోరింది.
ఇక ఈ పోస్టు తరువాత నిత్యా మీనన్.. 'అసలు నేరస్తుడు దొరికాడు' అంటూ మరో పోస్ట్ వేసింది. మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తుంది అంటూ ఆ వెబ్ సైట్ పై సీరియస్ అయ్యింది. ప్రస్తుతం నిత్యా చేసిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నిత్యా మీనన్ సినిమాలు విషయానికి వస్తే.. తాజాగా 'కుమారి శ్రీమతి' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 28న డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంది.
Next Story