బ్రేక్ ఈవెన్ ఓకె.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ డౌటే!
నితిన్ భీష్మ చిత్రం వారం గడవకముందే బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయమే. ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన భీష్మ మిగతా ఏరియా ల్లోనూ రేపటిలోగా [more]
నితిన్ భీష్మ చిత్రం వారం గడవకముందే బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయమే. ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన భీష్మ మిగతా ఏరియా ల్లోనూ రేపటిలోగా [more]
నితిన్ భీష్మ చిత్రం వారం గడవకముందే బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయమే. ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన భీష్మ మిగతా ఏరియా ల్లోనూ రేపటిలోగా బ్రేక్ ఈవెన్ సాధించడం పక్కా.. సో ఫస్ట్ వీక్ లోనే బయ్యర్లు లాభాల పట్టారు. అయితే భీష్మ సినిమా గత ఏడాది డిసెంబర్ ఎండింగ్ లో కానీ.. లేదా ఈ ఏడాది ఏప్రిల్ లో కానీ విడుదల చేసుంటే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ఖచ్చితంగా వచ్చేవి. కానీ రాంగ్ టైమింగ్ లో భీష్మ సినిమా విడుదల చెయ్యడం తో భీష్మ కి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రావడం కాస్త డౌటే అనిపిస్తుంది.
ఫిబ్రవరి, మార్చ్ పిల్లలకి ఎగ్జామ్స్ టైం. సో విద్యార్థులు బిజీ, వారితో పాటుగా తల్లితండ్రులు బిజీ. అయితే ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ తో దూసుకుపోయిన భీష్మ సోమవారం నుండి కాస్త వీక్ అవడం మొదలెట్టింది. ఇక రేపు శుక్రవారం హిట్ సినిమా వచ్చి.. హిట్ అయ్యింది అంటే భీష్మ కలెక్షన్స్ డల్ అవడం ఖాయం. హిట్ కి తేడా టాకొస్తే.. మార్చి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు భీష్మ తప్ప మరో ఛాయస్ లేదు. అలా లాంగ్ రన్ లో భీష్మ కలెక్షన్స్ బడ్జెట్ కి డబుల్ లాభాలు రావొచ్చని.. అందుకే రేపు శుక్రవారం హిట్ సినిమాపై భీష్మ బ్లాక్ బస్టర్స్ కలెక్షన్స్ ఆధారపడతాయి అని చెబుతున్నారు. మరి నాని నిర్మతగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ మీద మంచి అంచనాలే కాదు.. ట్రైలర్ చూస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా పెరిగింది అనిపిస్తుంది.