Thu Apr 17 2025 02:47:59 GMT+0000 (Coordinated Universal Time)
తన మీద వచ్చిన కథనాలపై కోపం తెచ్చుకున్న నిత్యా మీనన్
తన మీద వచ్చిన కథనాలపై కోపం తెచ్చుకున్న నిత్యా మీనన్

పలు హీరోయిన్స్ కు పెళ్లిళ్లకు సంబంధించి కథనాలు వస్తూ ఉంటాయి. ఇటీవల నిత్యా మీనన్ కు ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందని కథనాలు వెలువడ్డాయి. మలయాళ స్టార్ హీరోతో ప్రేమాయణం అంటూ ప్రచారం సాగింది. స్నేహితుల ద్వారా పరిచయమైన వీళ్లిద్దరూ చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని.. ఇటీవలే తమ ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపగా.. ఇరు కుటుంబాలు అంగీకరించాయని..త్వరలోనే వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని కథనాలను వండి వార్చాయి కొన్ని మీడియా సంస్థలు.
తాజాగా ఈ కథనాలపై నిత్యా మీనన్ స్పందించింది. తన పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని స్పష్టం చేసింది. ఇలాంటి కథనాలను ప్రచురించేముందు ఓసారి నిర్ధారణ చేసుకుంటే బాగుంటుందని.. నిజాలను ప్రచురిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని వ్యాఖ్యానించింది.
తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల పవన్ సరసన భీమ్లా నాయక్ చిత్రంలో నటించి మెప్పించింది. 'మోడ్రన్ లవ్' అనే వెబ్ సిరీస్ ఇటీవలే విడుదలైంది.
Next Story