Sun Dec 22 2024 22:02:15 GMT+0000 (Coordinated Universal Time)
నివేతా పేతురాజ్ మీద ఊహించని రూమర్స్.. ఇలా స్పందించింది
ముఖ్యమంత్రి కుమారుడు నటి నివేతా పేతురాజ్‌కు 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని
ముఖ్యమంత్రి కుమారుడు నటి నివేతా పేతురాజ్‌కు 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని కొద్దిరోజుల కిందట సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇదే విషయమై తమిళ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి మాట్లాడిన సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చివరికి నివేతా పేతురాజ్ దాకా చేరింది. ఈ విషయంపై ఆమె కాస్త ఘాటుగా స్పందించింది.
"నా మీద డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారని తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. నేను ఇన్ని రోజులూ మౌనంగా ఉన్నాను. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల వయస్సు నుండి ఆర్థికంగా స్వతంత్రంగా, స్థిరంగా ఉన్నాను. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్‌లో నివసిస్తోంది. మేము 20 సంవత్సరాలకు పైగా దుబాయ్‌లోనే ఉన్నాము. సినీ పరిశ్రమలో నన్ను సినిమాలో తీసుకోవాలని, సినిమా అవకాశాలు ఇప్పించమని నేను ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోని అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను, అవన్నీ నన్ను నమ్మి నాకు దొరికిన పాత్రలే. నేను ఎప్పుడూ డబ్బు కోసం అత్యాశ పడలేదు" అంటూ నివేతా పోస్టు పెట్టింది. నివేతా తెలుగులో పలు హిట్ సినిమాలలో నటించింది. అల వైకుంఠపురంలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది.
Next Story