రెజీనాని కాపాడే నాధుడే లేదా?
చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే విలంగాను నెగెటివ్ రోల్ లో కనిపించింది. కానీ ఎన్ని చేస్తున్నా, ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. గ్లామర్ డాల్ రెజినా [more]
చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే విలంగాను నెగెటివ్ రోల్ లో కనిపించింది. కానీ ఎన్ని చేస్తున్నా, ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. గ్లామర్ డాల్ రెజినా [more]
చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే విలంగాను నెగెటివ్ రోల్ లో కనిపించింది. కానీ ఎన్ని చేస్తున్నా, ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. గ్లామర్ డాల్ రెజినా కసాండ్రకి సరైన బ్రేక్ రావడం లేదు. గ్లామర్ ఉంది, పెరఫార్మెన్స్ స్కిల్స్ ఉండి కూడా.. ఇంకా కెరీర్ లో స్ట్రగుల్ అవుతూనే ఉంది. అసలు ఆచార్య సినిమాలో మొదటగా రిలీజ్ చేద్దామనుకున్న పాట.. చిరంజీవి – రెజినా ఐటెం సాంగ్. ఎందుకంటే ఈ వయసులో ఐటెం సాంగ్ ఏంటి అనుకునే వారికి.. ముందే రిలీజ్ చేసేసి అలవాటు చేద్దామని. అప్పట్లో ఖైదీ నెంబర్ 150 టైం లో కూడా చిరు – కాజల్ ల అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ ని ఫస్ట్ రిలీజ్ చేసి అందరికి అలవాటు చేసేసారు.
అయితే ఇప్పుడు కూడా చిరు – రెజినా సాంగ్ ముందే రిలీజ్ చేసేద్దామనుకున్నారు. అప్పుడు ఆ రకంగా రెజినా హైలెట్ అయ్యేది. కానీ ఆచార్య దర్శకుడు కొరటాల శివ దానికి వ్యతిరేఖంగా ఉన్నాడు. ముందుగా ఆచార్య నుండి ఐటెం సాంగ్ ఎందుకు.. ముందు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సాంగ్ వదిలితే ఆ క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుంది అన్నారట. మరి ఆచార్య నుండి ఐటెం సాంగ్ ముందుగా వదిలినట్టయితే.. ఆ లిరిక్స్ కానీ, ఆ సాంగ్ లో డాన్స్ కానీ రేజీనాకి హెల్ప్ అయ్యేవి. ఈ విధంగా చిరు కూడా రెజినా కెరీర్ ని కాపాడలేకపోతున్నారనే చెప్పాలి.