రూలర్ కి ఓవర్సీస్ కష్టాలు
బాలకృష్ణ ఏజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏజ్ లోను సినిమాల కోసం 20 కేజీల బరువు తగ్గడం అనేది కేవలం బాలయ్యకే చెల్లింది. [more]
బాలకృష్ణ ఏజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏజ్ లోను సినిమాల కోసం 20 కేజీల బరువు తగ్గడం అనేది కేవలం బాలయ్యకే చెల్లింది. [more]
బాలకృష్ణ ఏజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏజ్ లోను సినిమాల కోసం 20 కేజీల బరువు తగ్గడం అనేది కేవలం బాలయ్యకే చెల్లింది. మరో 20 రోజుల్లో రూలర్ అంటూ హడావిడి చెయ్యబోతున్న బాలకృష్ణ తన తర్వాత చిత్రం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి తో చేస్తున్నాడు. జనవరి నుండి బాలయ్య – బోయపాటి ల సినిమా పట్టాలెక్కబోతుంది. త్వరలోనే విడుదలకాబోతున్న రూలర్ సాంగ్స్ ఒక్కోక్కటిగా బయటికొస్తున్నాయి. మంచి ఊపుమీదున్న బాలయ్య – కె ఎస్ రవికుమార్ లు ఈ చిత్రాన్ని మాస్ ప్రేక్షకులు మెచ్చేలా చేసారని యూనిట్ చెబుతుంది. అభిమానులు మెచ్చేలా మాస్ చిత్రాలు చేసే బాలయ్యకి మల్టిప్లెక్స్ ఆడియన్స్ కన్నా ఎక్కువగా బిసి సెంటర్స్ ఆదరణ ఎక్కువగా ఉంటుంది.
అయితే బాలయ్య చిత్రాలకు మల్టిప్లెక్స్ మాత్రమే కాదు.. ఓవర్సీసీ ప్రేక్షకులకు అంతగా ఎక్కవు. అందులోను బాలయ్య కథానాయకుడు, మహానాయకుడు ప్లాప్ అవడంతో బాలకృష్ణ రూలర్ సినిమాకి ఓవర్సీస్ లో బిజినస్ జరగడం లేదని టాక్. రొటీన్ కథలతో బోర్ కొట్టిస్తున్న బాలయ్య సినిమాలంటే ఓవర్సీస్ ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడం లేదనే సాకుతో.. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ రూలర్ సినిమాని మరీ చీప్ గా అడుగుతున్నట్లుగా టాక్. రూలర్ సినిమాలో ఓవర్సీస్ లో బజ్ లేదని, అందుకే సినిమాని కొద్దిపాటి ధరకు కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో… నిర్మాతలు ఓవర్సీస్ లో ఓ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అడ్వాన్స్ కూడా ఏమీ తీసుకోకుండా సినిమాను వాళ్ళ ద్వారా రిలీజ్ చేసే ఏర్పాట్లు చేసుకుంటున్నారట. మరి లాభాలొస్తే డబ్బు వస్తుంది… లేదంటే ఖాళీ అన్నమాట.