చిరు ని కాలం – కరోనా రెండూ కన్ఫ్యూజ్ చేశాయా?
ప్రస్తుతం ఇండస్ట్రీలో చిరు కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ.. ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే కాదు..అభిమానులు, ఇండస్ట్రీలో చిరు ని ఇష్టపడేవారు దేవుడి గుళ్ళు చుట్టూ తిరుగుతూ [more]
ప్రస్తుతం ఇండస్ట్రీలో చిరు కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ.. ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే కాదు..అభిమానులు, ఇండస్ట్రీలో చిరు ని ఇష్టపడేవారు దేవుడి గుళ్ళు చుట్టూ తిరుగుతూ [more]
ప్రస్తుతం ఇండస్ట్రీలో చిరు కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ.. ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే కాదు..అభిమానులు, ఇండస్ట్రీలో చిరు ని ఇష్టపడేవారు దేవుడి గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఆయనకు కరోనా తగ్గాలంటూ పూజలు చేస్తున్నారు… సోమవారం ఆచార్య సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే ముందు మెగాస్టార్ చిరు కరోనా టెస్ట్ చేయించుకోగా…. అందులో చిరుకి రిజల్ట్ పాజిటివ్ రావడంతో.. చిరంజీవి హోమ్ క్వారంటైన్ కి వెళ్ళిపోయి.. కరోనా పాజిటివ్ అయినా కానీ ఎలాంటి కరోనా లక్షణాలు నాలో లేవు నేను బావున్నా అంటూ ట్వీట్ చెయ్యడంతో మెగా ఫాన్స్, సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
చిరు కూడా ఎవరిని కలవకుండా, ఆచార్య షూటింగ్ కూడా పక్కనబెట్టి.. గత నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. తాజాగా చిరు గత నాలుగు రోజులుగా కరోనా, కాలం రెండూ నన్ను కన్ఫ్యూజ్ చేసి నాతొ ఆడేసుకున్నాయి. ఆదివారం కరోనా టెస్ట్ లో పాజిటివ్ రావడంతో బేసిక్ మెడిటేషన్ మొదలు పెట్టాను. రెండు రోజులు గడిచినా ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో.. నాకు అనుమానం వచ్చి అపోలో డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు సిటీ స్కాన్ చేసి.. చెస్ట్ లో ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారణకు వచ్చాక కరోనా టెస్ట్ చేస్తే నెగెటివ్ వచ్చింది. అక్కడ నెగెటివ్ వచ్చాక మరోసారి మరోచోట నివృత్తి చేసుకుందామని టెనెట్ ల్యాబ్ లో మూడు రకాల కిట్స్ తో మూడుసార్లు టెస్ట్ చేయించగా అక్కడ కూడా నెగెటివ్ వచ్చింది.
మరి గత ఆదివారం నాకు ఎక్కడైతే కరోనా టెస్ట్ చేసారో అక్కడ మళ్ళీ RT PCR టెస్ట్ చేయించగా దానిలో నెగెటివ్ వచ్చింది. అయితే ఈ మూడు రిపోర్ట్స్ చూసాక మొదటి రిపోర్ట్ ఫాల్ట్ కిట్ వలన వచ్చింది అని డాక్టర్స్ నిర్ధారణకు వచ్చారు. సో నాకు కరోనా లేదు. ఈ సమయంలో మీరు నా మీద చూపించిన ప్రేమకి, ఆదరాభిమానాలకు, చేసిన పూజలకు కృతజ్ఞతలు అంటూ చిరు ఉత్సాహంగా ట్వీట్ చెయ్యడంతో ఆయన అభిమానులే కాదు… సినిమా ఇండస్ట్రీ మొత్తం ఊపిరి పీల్చుకుంది.