అప్పుడు ఒంటిపై బట్టలే లేవు..!
బాలీవుడ్లో జెండా పాతేసిన అచ్చ తెలుగమ్మాయి శోభిత దూలిపాళ. పేరుకు తెలుగమ్మాయే కానీ... బాలీవుడ్ భామల్ని మించిపోయేంత బోల్డ్‌గా తెరపై కనిపిస్తుంటుందీమె. మిస్ ఇండియా కిరీటం గెలుచుకొన్నాక కొన్నాళ్లు మోడల్‌గా పనిచేసిన శోభిత ఆ తర్వాత బాలీవుడ్లో సినిమా ప్రయాణం ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో 'రమణ్ రాఘవ్ 2.0'చిత్రంలో నటించింది. అందులో శోభిత హాట్‌గా కనిపించిన విధానం బాలీవుడ్‌ని ఆకట్టుకుంది. దాంతో వరుసగా అవకశాలొచ్చాయి. ప్రస్తుతం అక్కడ నటిస్తూనే తెలుగు చిత్ర పరిశ్రమవైపు దృష్టిపెట్టింది. అడవి శేష్‌తో కలిసి నటించిన తొలి తెలుగు చిత్రం 'గూఢచారి' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో సందడి చేస్తోంది.
శోభిత ఓ ఇంటర్వ్యూలో తన తొలి సినిమా కోసం చేసిన తొలి సన్నివేశం గురించి చెప్పింది. ఆ సన్నివేశం గురించి ఆమె చెప్పిన విషయాలు భలే ఫన్నీగా అనిపించాయి. ఆమె చేసిన తొలి సన్నివేశంలోనే దాదాపుగా నగ్నంగా నటించాల్సి వచ్చిందట.ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొంటూ ''సెట్లో నాకదే తొలి రోజు. ఒకట్రెండు సన్నివేశాల చిత్రీకరణ అవ్వగానే మా అమ్మ ఫోన్ చేశారు. ఈ రోజు షూటింగ్ ఏంటి? నీ కాస్ట్యూమ్స్ ఏంటి? అని అడిగారు. ఆ మాట వినగానే నాకు నవ్వొచ్చింది. నేనేమో ఒంటిపై అరకొర దుస్తులతో ఇంటిమసీ సన్నివేశాల్లో నటిస్తున్నా. ఆ విషయం తర్వాత చెబుతా అని ఫోన్ పెట్టేశా'' అంటూ నవ్వేసింది శోభిత.
ఆ సినిమా విడుదలయ్యాక ఇంట్లోవాళ్లు స్పందించిన విధానం గురించి కూడా చెప్పుకొచ్చింది శోభిత. ''ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయని మాకు ముందే చెప్పొచ్చు కదే. చుట్టాల్ని తీసుకొచ్చేవాళ్లం కాదు'' అన్నారట. మరికొంతమంది చుట్టాలైతే ఆ సినిమాని చూసి కూడా ''నీ సినిమా విడులైందామ్మా... సరే, ఆల్ ది బెస్ట్'' అని చెప్పి వెళ్లిపోయారట. అయినా ''ఎవరేమనుకొంటే నాకేంటి? నా కెరీర్ నాది కదా. నన్ను అర్థం చేసుకొనేవాళ్లు చేసుకొంటారు. లేనివాళ్లు లేద''ని చెప్పుకొచ్చింది శోభిత.