చైతు పై ఫోకస్ లేదా?
మజిలీ తో మంచి హిట్ ఉన్న నాగ చైతన్య, సాయి పల్లవి శేఖర్ కమ్ముల కాంబోలో లవ్ స్టోరీ సినిమా చేసాడు. లవ్ స్టోరీ పై ప్రేక్షకుల్లోనే [more]
మజిలీ తో మంచి హిట్ ఉన్న నాగ చైతన్య, సాయి పల్లవి శేఖర్ కమ్ముల కాంబోలో లవ్ స్టోరీ సినిమా చేసాడు. లవ్ స్టోరీ పై ప్రేక్షకుల్లోనే [more]
మజిలీ తో మంచి హిట్ ఉన్న నాగ చైతన్య, సాయి పల్లవి శేఖర్ కమ్ముల కాంబోలో లవ్ స్టోరీ సినిమా చేసాడు. లవ్ స్టోరీ పై ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ లోను మంచి క్యూరియాసిటీ ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే మాములుగా ఏ హీరో సినిమా అయినా వస్తుంది అంటే దాని మీద అంటే అభిమానుల్లో అటెంక్షన్, ప్రేక్షకుల్లో ఫోకస్ ఉంటుంది. కానీ లవ్ స్టోరీ సినిమా విషయానికి వచ్చేసరికి లీడ్ తీసుకుంటుంది మాత్రం డైరెక్టర్ మరియు హీరోయిన్. హీరో నాగ చైతన్య కన్నా దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయి పల్లవి మీదే ఎక్కువగా ఫోకస్ ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సారంగా దారియా సాంగ్ యూట్యూబ్ ని ఓ ఊపు ఊపుతుంది. సాయి పల్లవి తన డాన్స్ తో ఎక్సప్రెషన్స్ తో మరోసారి తన మార్క్ చూపించింది.
మరి శేఖర్ కమ్ములకి ఫిదా లాంటి హిట్ ఉండడం, ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున సినిమా లవ్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల మూవీ గానే ప్రొజెక్ట్ అవుతుంది. అందుకే లవ్ స్టోరీ విషయంలో అటు దర్శకుకుడు, ఇటు హీరోయిన్ లీడ్ తీసుకుంటున్నారు. ఏదైనా లవ్ స్టోరీ పై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను మంచి పాజిటివ్ బజ్ అయితే ఉంది. ఎవరు లీడ్ తీసుకుంటే ఏమిటి.. సక్సెస్ అనేది వచ్చి పడితే చాలుగా. చైతు అకౌంట్ లో లవ్ స్టోరీతో ఇంకో సక్సెస్ పడిపోయినట్టే.. కాదు పడిపోతుంది అంతే.