నా పిల్లలు, పేరెంట్స్ కోసం అలా చేస్తున్నా?
విలక్షణ నటి సాయి పల్లవి.. గ్లామర్ గా నటించడానికి, పొట్టి దుస్తులు వెయ్యడానికి, అలాగే లిప్ లాక్ లకు ఆమడ దూరంలో ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలైనా [more]
విలక్షణ నటి సాయి పల్లవి.. గ్లామర్ గా నటించడానికి, పొట్టి దుస్తులు వెయ్యడానికి, అలాగే లిప్ లాక్ లకు ఆమడ దూరంలో ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలైనా [more]
విలక్షణ నటి సాయి పల్లవి.. గ్లామర్ గా నటించడానికి, పొట్టి దుస్తులు వెయ్యడానికి, అలాగే లిప్ లాక్ లకు ఆమడ దూరంలో ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలైనా కథ నచ్చి పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటుంది. అలాగే గ్లామర్ షోకి, కూర్చ దుస్తులు వెయ్యడానికి మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. తాజాగా కూడా తాను ఎందుకు అలా నటించనో చెబుతుంది సాయి పల్లవి. ఇప్పటివరకు నేను నటించిన సినిమాల పట్ల, నా కెరీర్ పట్ల చాలా హ్యాపీ గా ఉన్నాను, నాకొచ్చిన పాత్రలతో తృప్తిగానే ఉన్నాను, ఏదో సాధించాలి అనే ఆలోచనలు లేదు, ఆశ కూడా లేదు. నటిగా అందరికి గుర్తుండిపోయే పాత్రలు దొరికితే చాలు అంటుంది.
ఓ కథ నా దగ్గరకు వస్తే ఆ కథ నాకు సరిపోతుందా? నా హద్దులు తగ్గట్టుగా ఉందా? లేదా? అనేది చూసుకుంటాను. ఎందుకంటే నా బలము, నా బలహీనతలు నాకు తెలుసు కాబట్టి. ఇంట్లో వాళ్ళు, బయటి వారు నన్నో నటిగా చూడరు. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలానే ట్రీట్ చేస్తారు. అన్ని కథలు, అన్ని పాత్రలు నాకు నప్పేయ్యవు. ఏ పాత్ర అయినా నాకు, చూసే వాళ్ళకి సౌకర్యంగా ఉందొ.. లేదో.. అని ఒకటికి రెండుసార్లు అలోచించి నిర్ణయం తీసుకుంటాను. కురచ దుస్తులతో నేను సౌకర్యంగా ఉండలేను. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత కూడా నా పిల్లలు నా సినిమా చూసి సంతోషపడాలి. అలాగే నా పేరెంట్స్ నా సినిమాలు చూసి గర్వపడేవిలా ఉండాలి. అందుకే గ్లామర్ షోకి, లిప్ లక్స్ కి నేను దూరం అంటుంది సాయి పల్లవి.
- Tags
- sai pallavi