ప్రమోషన్ ఉంటేనా.. సూపర్ హిట్టే!!
హీరో సత్య దేవ్ హీరోగా నిలబడానికి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి. డీసెంట్ కేరెక్టర్స్ చేసినా సత్యదేవ్ కి అనుకునేంత ఫేమ్ రావడం లేదు. గత ఏడాది [more]
హీరో సత్య దేవ్ హీరోగా నిలబడానికి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి. డీసెంట్ కేరెక్టర్స్ చేసినా సత్యదేవ్ కి అనుకునేంత ఫేమ్ రావడం లేదు. గత ఏడాది [more]
హీరో సత్య దేవ్ హీరోగా నిలబడానికి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి. డీసెంట్ కేరెక్టర్స్ చేసినా సత్యదేవ్ కి అనుకునేంత ఫేమ్ రావడం లేదు. గత ఏడాది బ్లఫ్ మాస్టర్ తోనే హిట్ కొడతాడనుకుంటే.. అది నిరాశపరిచింది. ఇక మొన్నామధ్యన ఓటిటిలో విడుదలైన 47 డేస్ కూడా ప్లాప్ అవడంతో.. సత్యదేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మీదే ఆశలు పెట్టుకున్నఉడ్. ఆ సినిమా కూడా మొన్న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. విడుదలైన రోజే మంచి టాక్ తెచ్చుకుంది. కాకపోతే ఎలాంటి ప్రమోషస్న్ లేకుండా విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ రాబట్టి సరిపోయింది లేదంటే… ఎప్పుడు విడుదలవుతుందో తెలియని సినేమానికి ప్రేక్షకాదరణ ఏముంటుంది.
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో సత్య దేవ్ నటనకు మంచి అంర్కులు పడ్డాయి. సినిమాకి పాజిటివ్ టాక్ రావడమే కాదు. సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య పై చర్చిండంతో తో ఈసినిమాకి ఇంకాస్త క్రేజ్ పెరిగింది. ఆశలు సినిమాని ఓటిటిలో పెట్టేముందే కాస్త సోషల్ మీడియాలో సత్య దేవ్ టీం హంగామా చేసినట్టయితే… ఈ సినిమా మరింతగా ప్రమోట్ అయ్యి నెట్ ఫ్లిక్స్ లో అదరగొట్టేది. కనీసం ఇప్పుడైనా ఉమామహేశ్వర పై సత్య దేవ్ దృష్టి పెడితే… ఈ సినిమాని వీక్షించే ప్రేక్షకులు ఎక్కువవుతారు. కనీసం థియేటర్స్ లో విడుదలై ఉంటే ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తో సినిమా హిట్టా.. సూపర్ హిట్టా అనేది తేలేది. కానీ ఓటిటిలో సినిమాని విడుదల చేసారు కాబట్టి.. సోషల్ మీడియాలో ఆ సినిమాపై ముచ్చటించే వారిని బట్టి సినిమా ఫలితాన్ని అంచనా వెయ్యాల్సి ఉంటుంది. మరి ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యాని టీం వదిలేసినా నెటిజెన్స్ మాత్రం, ట్విట్టర్ లో మాట్లాడుతూ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు.