Tue Dec 24 2024 12:23:04 GMT+0000 (Coordinated Universal Time)
ఖుషి రీ రిలీజ్ కు థియేటర్లు నిల్.. నిరాశ తప్పదా ?
లవ్ సీన్స్ కి ఒక ట్రెండ్ ను సెట్ చేసిన ఈ సినిమాకు ప్రస్తుతం నటుడు, విలన్ గా నటిస్తోన్న ఎస్ జె సూర్య దర్శకత్వం..
టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిన పవన్ కల్యాణ్ సినిమా ఖుషి. పవన్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ విడుదలై 22 ఏళ్లైనా.. మేనియా ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. లవ్ సీన్స్ కి ఒక ట్రెండ్ ను సెట్ చేసిన ఈ సినిమాకు ప్రస్తుతం నటుడు, విలన్ గా నటిస్తోన్న ఎస్ జె సూర్య దర్శకత్వం వహించాడు. 22 ఏళ్ల తర్వాత.. న్యూ ఇయర్ సందర్భంగా ఖుషి సినిమాను మళ్లీ రిలీజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ కు సిద్ధమైంది చిత్రయూనిట్. అయితే.. ఈ రీ రిలీజ్ కు థియేటర్లు ఖాళీ లేవంటున్నాయి మల్టీప్లెక్స్ ల యాజమాన్యాలు. ఈ సమస్య ఇండియాలో కాదండి.. అమెరికాలో.
గతంలోనూ వివిధ స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేయగా.. నష్టాలే మిగిలాయని, ఈసారి రీ రిలీజ్ కు థియేటర్లు ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారట అక్కడి థియేటర్ల ఓనర్లు. దాంతో ఖుషి రీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎంత పాత సినిమా అయినా.. టీవీల్లో ఎన్నిసార్లు చూసిన థియేటర్లో చూస్తే వచ్చే కిక్కే వేరు కదా. అందులోనూ పవన్ సినిమా అంటే ఊరుకుంటారా ? ఇండియాలో ఈ రీ రిలీజ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
Next Story