Sun Dec 22 2024 22:32:59 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు మొదలైన ఎన్నికల సందడి
ఈ సారి నిర్మాతలు సి.కల్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ మధ్య పోటీ హోరాహోరీగా ఉండనుంది. ప్రస్తుతం వీరిద్దరే..
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 14న నామినేషన్స్ పూర్తయింది. జులై 21తో నామినేషన్ల విత్ డ్రా సమయం కూడా పూర్తి అయింది. ఇక జులై 30న ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈసారి నిర్మాతలు సి.కల్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ మధ్య పోటీ హోరాహోరీగా ఉండనుంది. ప్రస్తుతం వీరిద్దరే అధ్యక్ష బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నామినేషన్లలో ఎగ్జిబిటర్ సెక్టార్ ఎన్నిక ఏకగ్రీవమవ్వగా.. తెలుగు నిర్మాతల సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్ కు ఎన్నికలు జరగనున్నాయి.
నిర్మాత సి. కల్యాణ్ ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో కీలక పదవుల్లో పనిచేయడంతో పాటు.. దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గానూ పనిచేశారు. మరోవైపు దిల్ రాజు.. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఏర్పాటు చేసుకున్న గిల్డ్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరి ప్యానెల్స్ మధ్య ఎన్నికలు జరగనుండటం ఆసక్తికరంగా మారింది.
Next Story