‘నోటా’లో కేసీఆర్..!
ఈ మధ్య పొలిటికల్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. పొలిటికల్ డ్రామా సినిమాలు డీల్ చేసే విధానం తెలియాలి కానీ వాటిపై కూడా వసూళ్లు భారీ లెవెల్ లో దక్కించుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో పొలిటికల్ డ్రామా సినిమాలు తెర మీదకు రానున్నాయి. వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ నటించిన 'నోటా'. ట్రైలర్ బట్టి చూస్తుంటే అది పక్కా పొలిటికల్ డ్రామా అని అర్థం అవుతోంది. అయితే తమిళ డోస్ ఎక్కువ అయిందని కామెంట్స్ వచ్చినా ఇందులో దక్షిణాది రాజకీయాల ముఖచిత్రాన్ని ఆవిష్కరించేశారని టాక్.
తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్...
అంతేకాదు ఆంధ్ర, తెలంగాణ పాలిటిక్స్ ని కూడా ఇందులో చూపించనున్నారట. విభజన టైంలో ఎదురుకున్న పరిస్థితులని ఇందులో చూపించనున్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను పోలిన పాత్రలు ఈ సినిమాలో చూడవచ్చని, వాళ్లని సైతం పాజిటీవ్ గానే చూపించారని సమాచారం. అంతేకాదు ఇందులో జయలలిత ఎపిసోడ్ కూడా ఉందని టాక్. జయలలిత ఆసుపత్రిలో చనిపోయినప్పుడు అక్కడ ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. ఆ ఎపిసోడ్ కి సంబంధించి ఇండైరెక్ట్ గా కొన్ని డైలాగులు పేల్చారట.
ఎవరినీ నొప్పించకుండా...
కర్నాటక, కేరళ రాజకీయాల్నీ గురించీ ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే ఎవరినీ నొప్పించకుండా.. ఎక్కడ ఇబ్బంది కలగకుండా.. అర్ధం అయ్యి అర్ధం అవ్వనట్టు ఆ ఎపిసోడ్స్ ని నడిపించారని సమాచారం. మరి ఇవన్నీ అసలు నిజంగానే 'నోటా'లో చూపించారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ చూపిస్తే ఆ ఎపిసోడ్స్ సినిమాలో ఏ రేంజ్ లో పండాయో తెలియాలంటే వచ్చే నెల అక్టోబర్ 5 వరకు ఆగాల్సిందే.