నోటా దెబ్బకి.... ధైర్యం వచ్చిందిగా..!
విజయ్ దేవరకొండ నోటా సినిమాతో, రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ తో పోటీ పడుతున్నారంటూ గతంలో చాలా వార్తలొచ్చాయి. కానీ రవితేజ సైలెంట్ గా అమర్ అక్బర్ ఆంటోనిని విడుదల చెయ్యకుండా తప్పుకున్నాడు. కానీ విజయ్ దేవరకొండ అనుకోకుండా నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. అప్పట్లో గీత గోవిందంతో సూపర్ ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండని తట్టుకుని.... ఫ్లాప్స్ లో ఉన్న రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీతో ఎలా నిలబడతాడో అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అప్పుడు రవితేజ, విజయ్ నుండి తప్పుకున్నాడు. అయితే విజయ్ గీత గోవిందం క్రేజ్ మొత్తం నోటాతో తుడిచి పెట్టుకుపోయింది. నోటా ఈ నెల మొదటి వారంలో విడుదలై ఫ్లాప్ అయ్యింది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం క్రేజ్ మొత్తం ఒకే ఒక సినిమాతో పోయిందన్నారు. కానీ విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం యూత్ లో ఏమాత్రం తగ్గలేదు. యూత్ లో ఎంత క్రేజున్నా విజయ్ నటించిన టాక్సీవాలాకు మంచి బిజినెస్ జరగక విడుదల కష్టాలు ఎదుర్కొంటుంది.
విజయ్ సినిమాపై పెరగని అంచనాలు
అయితే ఎలాగోలా ఆ సినిమాని నవంబర్ 18 కి విడుదల చెయ్యడానికి సిద్ధమయ్యారు. మరి నోటా సినిమా ఫ్లాప్ అవడంతో విజయ్ మర్కెట్ తగ్గిందనే ధైర్యంతో రవితేజ - శ్రీని వైట్ల తమ అమర్ అక్బర్ ఆంటోని సినిమాని నవంబర్ 18 కే దింపుతున్నారు. మరి అప్పుడు నోటా నుండి తప్పించుకుని... ఇప్పుడు టాక్సీవాలా బారిన పడ్డారు రవితేజ - శ్రీను వైట్ల. అయితే విజయ్ మర్కెట్ తగ్గిందని కాదు గానీ.. విజయ్ టాక్సీవాలాకు ఎన్ని చేసినా సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచలేకపోతున్నారు మేకర్స్. మరి ఇలాంటి టైంలోనే రవితేజ మంచి ప్రమోషన్స్ తో అమర్ అక్బర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హిట్ కొట్టాలనే ప్లాన్ తో ఉన్నాడు. మరి ఇదంతా చూస్తుంటే విజయ్ నోటా దెబ్బకి రవితేజకి బాగా ధైర్యం వచ్చినట్టుగా కనబడుతుందిగా...!