Sat Nov 23 2024 03:59:03 GMT+0000 (Coordinated Universal Time)
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు.. ప్రముఖ సింగర్ మృతి
కొన్నాళ్లుగా బ్రోంకోప్ న్యుమోనియాతో బాధపడుతున్న సుమిత్రాసేన్.. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో డిసెంబర్ 29న..
భారత సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2022లో ఎందరో అగ్ర, సీనియర్ నటులతో పాటు.. జూనియర్ ఆర్టిస్టుల్నీ కోల్పోయిన ఇండస్ట్రీలో.. వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న రాత్రి టాలీవుడ్ కు చెందిన గేయ రచయిత పెద్దాడ మూర్తి.. అనారోగ్యంతో కన్నుమూశారు. తాజాగా.. ప్రముఖ గాయని సుమిత్రాసేన్(89) కూడా తుదిశ్వాస విడిచారు. బెంగాలీ పరిశ్రమకు చెందిన ఆమె మరణాన్ని కూతురు శ్రబానీ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు.
కొన్నాళ్లుగా బ్రోంకోప్ న్యుమోనియాతో బాధపడుతున్న సుమిత్రాసేన్.. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో డిసెంబర్ 29న ఆస్పత్రిలో చేరారు. నేటి ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. 2012లో బెంగాలీ సంగీత పరిశ్రమకు సుమిత్రాసేన్ చేసిన కృషికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంగీత మహా సమ్మాన్ అవార్డును అందించింది. ఆమె 'మేఘ్ బోలేచే జబో జబో', 'తోమారీ జర్నతలర్ నిర్జోనే', 'సఖి భబోనా కహరే బోలే', 'అచ్ఛే దుఖో అచ్ఛే మృత్యు' వంటి కొన్ని ప్రసిద్ధ రవీంద్ర సంగీతాలను ఆలపించారు.
Next Story