నవంబర్ సినిమాల రిపోర్ట్స్..!
ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి చాలా సినిమాలు వస్తుంటాయి. అలానే గత శుక్రవారం కూడా మూడు సినిమాలు వచ్చాయి. జయప్రద కుమారుడు హీరోగా వచ్చిన 'శరభ', హెబ్బా పటేల్ హీరోయిన్ గా '24 కిస్సెస్', బిగ్ బాస్ ఫేమ్ తనీష్ హీరోగా 'రంగు' చిత్రాలు బాక్సాఫీస్ సందడి చేయడానికి వచ్చాయి. అంతకు ముందు రిలీజ్ అయిన 'టాక్సీవాలా' తప్ప మిగిలిన మూడు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. 'టాక్సీవాలా' 10 రోజులు ముగిసేసరికి 20 కోట్లు షేర్ ను వసూల్ చేసి పూర్తి సేఫ్ జోన్ లోకి వెళ్లింది. సినిమాని కూడా రీజనబుల్ రేట్లకు అమ్మడంతో రూపాయి నష్టం లేకుండా అందరూ సేఫ్ అయ్యారు. మరో రెండు రోజుల్లో 'రోబో 2.ఓ' వస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ కచ్చితంగా దీనిపైనా పడుతుంది. అయినా ఇది ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉంది కాబట్టి ఎఫెక్ట్ పడినా పెద్ద నష్టం ఏమి లేదు.
టాక్సీవాలా తప్ప మిగతావన్నీ...
జయప్రద కొడుకు హీరోగా వచ్చిన చిత్రం 'శరభ' మొదటి ఆటతోనే డిజాస్టర్ టాక్ దక్కించుకోవడంతో పికప్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. హీరోతో పాటు డైరెక్టర్ కూడా మైనస్ కావడంతో సినిమాను ఆదరించేవాళ్లే లేకపోయారు. తనీష్ 'రంగు' చిత్రం కొంచం పర్లేదు అనిపించుకున్న తనీష్ కు మార్కెట్ లేకపోవడంతో పాటు నిర్మాణం మరీ రాజీ పడిపోవడంతో మొత్తానికి ఫ్లాప్ తప్పలేదు. ఇక ఈ నెలలో రిలీజ్ అయిన పెద్ద సినిమాల్లో ఒకటి రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' కేవలం 5 నుంచి 6 కోట్ల మధ్యలో ఫైనల్ రన్ క్లోజ్ అయ్యేలా ఉంది. మొన్నటివరకు రవితేజ మూవీస్ అంటే మినిమం గ్యారంటీ ఉండేవి. కానీ గత మూడు సినిమాల నుండి చూసుకుంటే రవితేజ సినిమా అంటేనే బయ్యర్లు భయపడే పరిస్థితి వచ్చేసింది. ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క 'టాక్సీవాలా' తప్ప మిగిలిన సినిమాలన్నీ వేస్ట్ అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.