Mon Dec 23 2024 10:48:05 GMT+0000 (Coordinated Universal Time)
NTR 30 రిలీజ్ డేట్ వచ్చేసింది.. అయినా నిరాశలోనే అభిమానులు
RRR సినిమా వచ్చి 9 నెలలు అయిపోయినా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల షూటింగ్స్ మొదలవ్వలేదు. ఎలాంటి అప్డేట్స్ లేవు. అందుకు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు.. 2022లో RRR సినిమా భారీ విజయాన్నిచ్చింది. రామ్ చరణ్ తో కలసి.. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఈ సినిమాతో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు లభించింది. ఇప్పటికే పలు హాలీవుడ్ అవార్డులందుకున్న.. RRR ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఉంది. కాగా.. RRR తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్లలో రెండు సినిమాలు అనౌన్స్ మెంట్ వచ్చింది కానీ.. ఇంతవరకూ అప్డేట్ లేదు.
RRR సినిమా వచ్చి 9 నెలలు అయిపోయినా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల షూటింగ్స్ మొదలవ్వలేదు. ఎలాంటి అప్డేట్స్ లేవు. అందుకు కారణాలేంటో కూడా తెలీదు. ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న అభిమానులకు .. NTR 30 యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ లో మొదటిరోజున సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. ఒక పోస్టర్ వదిలారు. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలు కానుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.
సినిమా రిలీజ్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ నిరాశలోనే ఉన్నారు. ఎందుకంటే.. వచ్చే ఏడాదికి సినిమా విడుదల. ఇప్పటికే ఎన్టీఆర్ తెరపై కనపడి 9 నెలలు అవుతుంది. ఇంకా 15 నెలలు ఆగాలా అని భావిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి కొరటాల సినిమాకంటే ముందే.. ప్రశాంత్ నీల్ సినిమా అయినా ఈ ఏడాది వస్తుందేమో చూడాలి.
Next Story