Mon Dec 23 2024 09:20:53 GMT+0000 (Coordinated Universal Time)
NTR 30: బర్త్ డే రోజు టైటిల్ అనౌన్స్ మెంట్.. టైటిల్ ఇదేనా ?
తాజాగా ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా..
RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా NTR30. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం NTR30 వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ కు జోడీగా అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. జాన్వీకి తెలుగులో ఇదే మొదటి సినిమా. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాను నందమూరి కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా NTR30 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ విడుదల చేయనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. NTR30గా చెప్పుకుంటున్న సినిమాకు దేవర అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న చిత్రయూనిట్.. మూడో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారట. హైదరాబాద్ లోనే ఒక స్పెషల్ సెట్ వేసి.. అక్కడ యాక్షన్ సీన్స్ ను తీయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. NTR30కి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.
Next Story