Wed Jan 08 2025 06:42:35 GMT+0000 (Coordinated Universal Time)
సమంతకు వచ్చిన సమస్యపై స్పందించిన ఎన్టీఆర్, అక్కినేని అఖిల్
సమంత తన ఆరోగ్యానికి సంబంధించి కీలక విషయాలను బయటపెట్టింది. తాను అరుదైన 'మయోసైటిస్' అనే వ్యాధితో బాధపడుతున్నానని ఆమె తెలిపింది. కొన్ని నెలల నుంచి ఈ వ్యాధికి ఆటో ఇమ్యూనిటీ కండిషన్ చికిత్స తీసుకుంటున్నానని చెప్పింది. తన తాజా చిత్రం 'యశోద'కు సమంత డబ్బింగ్ చెప్పింది.. అప్పుడు కూడా చేతికి సెలైన్ ఉంది. "కొన్ని నెలల నుంచి 'మయోసిటిస్'( కండరాల బలహీనత) అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలిపింది. ఈ విషయాన్ని పూర్తిగా రికవర్ అయ్యాక మీతో చెబుదాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుందని సమంత తెలిపింది. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని ఇప్పుడు రియలైజ్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. నేను త్వరలోనే కోలుకుంటానని డాక్టర్స్ కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు." అంటూ సమంత ఎమోషనల్ పోస్టు పెట్టింది.
సమంత త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తూ ఉన్నారు. అభిమానులు, సెలెబ్రిటీలు స్పందిస్తూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా సమంత కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టు పెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్లో..' నువ్వుత్వరగా కోలుకోవాలి.. మీకు ఆ ధైర్యాన్ని పంపుతున్నా' అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి జనతా గ్యారేజ్, రామయ్య వస్తావయ్యా, బృందావనం, రభస చిత్రాల్లో సమంత నటించింది. అక్కినేని కుటుంబం నుంచి హీరో అఖిల్ తన సానుభూతి తెలియజేశాడు. అందరి ప్రేమాభిమానాలు నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్ సామ్ అంటూ ట్వీట్ చేశాడు.
Next Story