Sun Dec 22 2024 22:11:40 GMT+0000 (Coordinated Universal Time)
NTR : ఎన్టీఆర్ అన్న కొడుకు హీరోగా ఎంట్రీ.. మోక్షజ్ఞ కంటే ముందే..!
బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కంటే ముందే ఎన్టీఆర్ అన్న కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..?
NTR : ప్రస్తుతం టాలీవుడ్ లో నందమూరి వారసులుగా బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియన్ ఎన్టీఆర్ రాణిస్తూ వస్తున్నారు. వీరితో పాటు తారకరత్న, చైతన్య కృష వంటి వారసులు.. హీరోగా పరిచయం అయ్యినప్పటికీ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోలేక పోయారు. కాగా రానున్న కాలంలో నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే వారసులు లిస్ట్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది.
ముందుగా బాలకృష్ణ కొడుకు 'మోక్షజ్ఞ' ఎంట్రీ గురించి మాట్లాడుకోవాలి. బాలయ్య తోటి హీరోల వారసులు.. ఆల్రెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా కొనసాగుతున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం.. అదుగో అదుగో అంటూనే సరిపోతుంది. అయితే ఈ ఏడాది కచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య చెప్పారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
అయితే ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్కి జానకి రామ్ అనే అన్నయ్య ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కారు ప్రమాదంలో మరణించిన విషయం కూడా తెలిసిందే. అప్పటి నుంచి జానకి రామ్ వారసుల బాధ్యతని ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ తీసుకున్నారు. జానకి రామ్ కి ఇద్దరు కొడుకులు. వారిలో పెద్ద కొడుకుని ఇప్పుడు హీరోగా పరిచయం చేయడం కోసం రంగం సిద్ధం చేస్తున్నారట.
ఇక ఈ భాద్యతలను ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన దర్శకుడు వైవిఎస్ చౌదరికి ఇచ్చినట్లు సమాచారం. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని వైవిఎస్ చౌదరి సిద్ధం చేస్తున్నారట. ఇక ఈ వార్తలు వింటుంటే మోక్షజ్ఞ కంటే ముందే ఈ వారసుడు ఎంట్రీ ఉండబోతుందా అనే సందేహం కలుగుతుంది. కాగా జానకి రామ్ పెద్ద కొడుకు పేరు కూడా 'ఎన్టీఆర్'. మరి ముత్తాత, బాబాయ్ పేరునే పెట్టుకున్న ఈ వారసుడు.. వారిలా ప్రేక్షాభిమానం అందుకుంటాడో లేదో చూడాలి.
Next Story