అందుకే హైప్ పెంచడం లేదా..?
ఎన్టీఆర్ బయోపిక్ మొదలైంది మొదలు సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని బాలకృష్ణ సాయి కొర్రపాటితో కలిసి నిర్మించాడు. మరి అదే అంచనాలతో భారీ [more]
ఎన్టీఆర్ బయోపిక్ మొదలైంది మొదలు సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని బాలకృష్ణ సాయి కొర్రపాటితో కలిసి నిర్మించాడు. మరి అదే అంచనాలతో భారీ [more]
ఎన్టీఆర్ బయోపిక్ మొదలైంది మొదలు సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని బాలకృష్ణ సాయి కొర్రపాటితో కలిసి నిర్మించాడు. మరి అదే అంచనాలతో భారీ క్రేజ్ మధ్య కథానాయకుడు భారీగా బిజినెస్ జరుపుకుంది. సినిమా విడుదలకు ముందుగా అంటే సినిమా మొదలైనప్పటి నుండే కథానాయకుడు ప్రమోషన్స్ పీక్స్ లో ఉంచారు క్రిష్, బాలయ్య. అందుకే సినిమా విడుదల సమయానికి కథానాయకుడుపై ఆకాశాన్నంటే క్రేజ్ తో సినిమా విడుదలైంది. మొదటి రోజు సూపర్ హిట్ అన్న ప్రేక్షకులు.. తర్వాతి రోజే పెదవి విరిచారు. కథానాయకుడు సూపర్ హిట్ అన్న వారే… పరమ బోరింగ్ అన్నారు. దీంతో దెబ్బకి కథానాయకుడు ఢమాల్.
ట్రైలర్ తో పెరగని అంచనాలు…
ఇక కథానాయకుడు సూపర్ హిట్ అయితే వెంటనే రెండో పార్ట్ మహానాయకుడుని ఒక నెల గ్యాప్ లో విడుదల చేద్దామనుకుంటే.. కథానాయకుడు దెబ్బకి మహానాయకుడుకి మహా రిపేర్లు చేసి ఎలాంటి చప్పుడు లేకుండా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధం చేస్తున్నారు క్రిష్, బాలకృష్ణ. మహానాయకుడుపై ఎలాంటి అంచనాలు లేవు. అలాగే ఎలాంటి హైప్ లేదు. మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో అర్ధం కాని పరిస్థితి. తాజాగా విడుదల చేసిన మహానాయకుడు ట్రైలర్ కూడా ఎలాంటి ఉత్సహాన్ని ప్రేక్షకుడిలో నింపలేదు. అసలు మహానాయకుడు ట్రైలర్ ట్రెండింగ్ లోనే లేదంటేనే పరిస్థితి అర్ధమవుతుంది.
అంచనాలు పెంచవద్దనే…
అయితే ఇలా సినిమా మీద అంచనాలు పెంచేసిన తర్వాత సినిమా తేడా కొడితే.. ప్రాబ్లెమ్ అవుతుందనే మహానాయకుడు టీం.. ఇలా పెద్దగా ప్రమోషన్స్ గట్రా చెయ్యడం లేదనేది ఇన్ సైడ్ టాక్. కథానాయకుడు అంచనాలతో పోలిస్తే మహానాయకుడుగా అంచనాలు సున్నా. అందుకే ఎలాంటి హైప్, క్రేజ్ లేకపోతే.. ప్రేక్షకులు ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోరు. ఓపెన్ మైండ్ తో మూవీకి వస్తారు. ఒకవేళ కంటెంట్ బాగుంటే హిట్ అవుతుంది. లేదంటే ప్రేక్షకులు కూడా నార్మల్ గా ఉంటారు. లేదంటే భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్ కి వస్తే సినిమా అంచనాలను అందుకోకపోతే.. బాగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి.. డ్యామేజ్ వీరలెవల్లో ఉంటుందని.. అలాంటి పరిస్థితి ఎందుకులే అనే మహానాయకుడు ప్రమోషన్స్ ని చిత్ర బృందం లైట్ తీసుకుందనిపిస్తుంది. మరోపక్క పాత బయ్యర్లకి సినిమాని ఇచ్చేశాం గనక.. మళ్లీ ప్రమోషన్స్ కి ఎక్స్ ట్రా ఖర్చెందుకు అని బాలయ్య అండ్ కో భావించబట్టే ప్రమోషన్స్ వీక్ అయ్యాయంటున్నారు.