Thu Dec 26 2024 00:58:48 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ వేడుక పై క్లారిటీ వచ్చింది
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో, ట్రైలర్ లాంచ్ వేడుకలు డిసెంబర్ 21న హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనున్నాయి. నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎన్టీఆర్ టీం అంతా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాల్లో రానుంది.
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్, జిస్సు సేన్ గుప్తా, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్..
Next Story