Fri Apr 25 2025 11:37:59 GMT+0000 (Coordinated Universal Time)
జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లకు ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల ఆహ్వానం
ఈ కార్యక్రమం ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో జరగనుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న..

స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు ఇటీవలే విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో మే 20న శకపురుషుడు సావనీర్, జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో జరగనుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈక్రమంలోనే కమిటీ చైర్మన్ టీడీ జనార్థన్ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ లను వారి నివాసాలకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేసి, ఆహ్వానించారు. అదే రోజున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడం విశేషం.
అలాగే ఈ కార్యక్రమానికి దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి జయకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, గారపాటి లోకేశ్వరి, కంఠంనేని ఉమాశ్రీనివాస్ ప్రసాద్, ఎన్టీఆర్ బావమరిది కాట్రగడ్డ రుక్మాంగదరావు తదితరులను కూడా ఆహ్వానించారు. మే 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కైతలాపూర్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది.
Next Story