Mon Dec 23 2024 14:29:08 GMT+0000 (Coordinated Universal Time)
Devara : ఎన్టీఆర్ 'దేవర' వైకింగ్స్ స్ఫూర్తితో వస్తుందా..?
ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమా వరల్డ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'వైకింగ్స్' స్ఫూర్తితో వస్తుందా..?
Devara : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తరువాత నటిస్తున్న చిత్రం 'దేవర'. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. జనవరి 8న ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు నేడు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ సముద్రంలో వేటకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది.
ఇక ఈ పోస్టర్, గతంలో కొరటాల చెప్పిన స్టోరీ లైన్ బేస్ చేసుకొని కొందరు నెటిజెన్స్.. ఈ సినిమా వరల్డ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'వైకింగ్స్' స్ఫూర్తితో వస్తుందా..? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల చెప్పిన స్టోరీ లైన్ ఏంటంటే.. "ఎవరికి తెలియని ఒక దీవి. ఆ దీవిలో దేవుడు, చావు అంటే భయం లేని వ్యక్తులు. వాళ్లకి భయం కలగజేసే ఒక వ్యక్తే హీరో" అంటూ చెప్పుకొచ్చారు.
వైకింగ్స్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. అది కూడా ఒక దీవిలోనే మొదలవుతుంది. అక్కడి వారు చావుకి భయపడరు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేస్తూ కథని ముందుకు తీసుకు వెళ్తుంటాడు హీరో. దేవర, వైకింగ్స్ స్టోరీలు ఏమైనప్పటికి.. ఎంచుకున్న బ్యాక్ గ్రౌండ్ థీమ్ ఒకటేలా కనిపిస్తుంది అని చెబుతున్నారు. మరి ఈ రెండిటికి ఏమైనా కనెక్షన్ ఉందా..? లేదా..? అనేది తెలియాలంటే గ్లింప్స్ లేదా ట్రైలర్ రావాల్సిందే.
కాగా ఈ సినిమాని కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని యాక్షన్ పార్ట్ షూట్ అంతా పూర్తి చేసేశారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Next Story