Mon Dec 23 2024 18:40:19 GMT+0000 (Coordinated Universal Time)
దేవరలో జాన్వీ.. 'తంగం' అంటే అర్ధం ఏంటి..?
దేవర సినిమాలో జాన్వీ కపూర్.. 'తంగం' అనే పాత్రలో కనిపించబోతుంది. ఇంతకీ తంగం అంటే అర్ధం ఏంటి..?
మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని రెండు పార్టులుగా తీసుకు వస్తున్నామంటూ ప్రకటించి సినిమా పై అంచనాలు మరింత పెంచేశాడు. ఇటీవలే ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ పార్ట్ మొత్తం పూర్తి చేసిన మూవీ టీం.. ఇప్పుడు సినిమాలోని ఎమోషన్, లవ్ మరియు ఇతర సన్నివేశాలు అన్ని చిత్రీకరిస్తున్నారు.
ఈక్రమంలోనే ప్రస్తుతం గోవా, గోకర్ణ ప్రాంతంలో పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాల్గొంది. తనకి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి చేసిన జాన్వీ.. మళ్ళీ ముంబై వచ్చేసింది. అయితే వచ్చిన దగ్గర నుంచి దేవర గురించి ఏదొక అప్డేట్ ఇస్తూ వస్తుంది. తాజాగా గోవా సెట్స్ లోని తన ఫోటోని లీక్ చేస్తూ.. మూవీలోని తన పాత్ర పేరుని కూడా తెలియజేసింది.
ఈ సినిమాలో జాన్వీ కపూర్.. 'తంగం' అనే పాత్రలో కనిపించబోతుంది. పేరు చాలా కొత్తగా ఉండేపాటికి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు దాని అర్ధం ఏంటని కొందరు గూగుల్ చేయడం మొదలు పెట్టారు. అలా వెతికి అర్ధం తెలుసుకున్న వారు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నారు. 'తంగం' అంటే బంగారం (Gold) అని అర్ధమట. అలాగే స్వచ్ఛత అనే అర్ధం కూడా వస్తుందట. ఇది తమిళ్, హిందీ భాషకి సంబంధించిన పదం అని చెబుతున్నారు.
ఇక సినిమాలో హీరో పాత్ర పేరు 'దేవర' అని, విలన్ పాత్ర పేరు 'భైర' అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు పేర్లకు కూడా అర్ధం చెబుతున్నారు. దేవర అంటే దేవుడు అని అర్థమని, భైర అంటే రాక్షసుడు, భయం అనే అర్ధం వస్తుందని తెలియజేస్తున్నారు. ఇక పాత్రల పేరుల్లో కూడా అర్ధం మెయిన్టైన్ చేస్తున్న కొరటాల శివని ఎన్టీఆర్ అభిమానులు అభినందిస్తున్నారు.
Next Story