Mon Dec 23 2024 10:52:48 GMT+0000 (Coordinated Universal Time)
NTR Devara దేవరలో విలన్ గా మరో బాలీవుడ్ హీరో?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాలో
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఓ విలన్ గా చేస్తున్నారు. ఇక హిందీ చిత్రసీమకు చెందిన మరో నటుడు బాబీ డియోల్ కూడా దేవర విలన్ల లిస్టులో భాగమని వార్తలు వస్తున్నాయి. అనిమల్ సినిమాలో విలన్ గా నటించి బాబీ డియోల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. టాలీవుడ్ లో కూడా పలు సినిమాలకు సైన్ చేశాడు బాబీ డియోల్. ఇప్పుడు దేవరలో కూడా చేయబోతూ ఉండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
దేవర టీమ్ బాబీ డియోల్తో చర్చలు జరుపుతోందని.. అవి చివరి దశలో ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో బాబీ కూడా విలన్గా నటించనున్నాడు. దేవర పార్ట్ 1లో సైఫ్ అలీఖాన్ మెయిన్ విలన్ కాగా.. బాబీ డియోల్ దేవర పార్ట్ 1లో సినిమా ముగిసే సమయానికి ప్రవేశిస్తాడని అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి డ్యాన్స్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని జాన్వీ కపూర్ తెలిపింది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Next Story