Mon Dec 23 2024 09:05:43 GMT+0000 (Coordinated Universal Time)
Devara : దేవర వాయిదా.. ఆ రిలీజ్ డేట్కి ఆ రెండు సినిమాలు..
ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ నుంచి వాయిదా పడుతుందట. దీంతో ఆ తేదికి ఆ ఇద్దరు హీరోలతో పాటు డబ్బింగ్ సినిమాలు..
Devara : ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపోంతుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి చిన్న గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి భారీ అంచనాలు క్రియేట్ చేశారు. దీంతో ఈ సినిమాని థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని ఏప్రిల్ 5న విడుదల చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఆ విడుదల తేదికి దేవర రావడం కష్టమని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సైఫ్ అలీఖాన్ కి గాయం అయ్యి చిన్న సర్జరీ అయ్యింది. ఆ గాయం కూడా దేవర షూటింగ్ లోనే జరిగినట్లు సమాచారం. ఇక సర్జరీ చేయించుకున్న సైఫ్ అలీఖాన్.. రికవరీ అయ్యి షూటింగ్ కి అటెండ్ అవ్వడానికి ఎక్కువ సమయమే పడుతుందట. అలాగే మూవీ VFX వర్క్స్ కూడా లేట్ అవుతుందట. ఈ కారణాలతో దేవర ఫస్ట్ పార్ట్ ముని ఏప్రిల్ నుంచి ఆగష్టు లేదా సెప్టెంబర్ కి వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
ఇక ఆ విడుదల తేదీ నుంచి దేవర తప్పుకోవడంతో.. ఆ డేట్ లోకి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' రాబోతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ నిర్మాత దిల్ రాజు, మొన్న సంక్రాంతి సమయంలోనే.. తమ సినిమా వేసవికి తీసుకు రాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దేవర తప్పుకోవడంతో ఆ డేట్కే ఫ్యామిలీ స్టార్ ని సిద్ధం చేస్తున్నారట. ఇక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి కొత్త రిలీజ్ తేదీ కోసం చూస్తున్న టిల్లుకి దేవర డేట్ కనిపించింది. దీంతో డీజే మోగించేందుకు ఆ తేదికి వచ్చేస్తున్నారట.
ఈ సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా ఆ తేదీలో రాబోతున్నాయి. తమిళ హీరో సూర్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కంగువ', బాలీవుడ్ హీరోల అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ‘బడే మియాన్ చోటే మియాన్’, అజయ్ దేవగణ్ ‘మైదాన్’ కూడా అప్పుడే రిలీజ్ కాబోతున్నాయి. అయితే దేవర వాయిదా వార్త పై క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story