Mon Dec 23 2024 13:14:00 GMT+0000 (Coordinated Universal Time)
NTR - Charan : మెగా ఇంట క్రిస్మస్ వేడుకలకు ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
రామ్ చరణ్ ఇంట క్రిస్మస్ వేడుకలకు ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
NTR - Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లో ఒక ఆహ్లాదకర వాతావరణం తీసుకు వస్తున్నారు. ప్రతి సెలబ్రేషన్స్ ని టాలీవుడ్ లోని ఇతర హీరోలతో సెలబ్రేట్ చేసుకుంటూ.. తామంతా ఎంతో స్నేహంగా ఉంటున్నాము, అభిమానులు కూడా అలాగే ఉండాలని తెలియజేస్తున్నారు. ఇటీవల దివాళి సెలబ్రేషన్స్ ని టాలీవుడ్ స్టార్స్ అందరితో తన ఇంట గ్రాండ్ గా జరిపిన రామ్ చరణ్.. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని కూడా నిర్వహించారు.
ఈ సెలబ్రేషన్స్ లో మెగా, అల్లు కుటుంబాలతో పాటు మహేష్ బాబు కుటుంబం కూడా పాల్గొంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను టాలీవుడ్ సెలబ్రేటిస్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈక్రమంలోనే మెగా హీరోలు కూడా కొన్ని ఫోటోలు షేర్ చేయగా.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ సతీమణి నమ్రతా కూడా కొన్ని పిక్స్ ని షేర్ చేశారు. ఆ ఫొటోల్లో ఉపాసన, నమ్రతా, గౌతమ్, సితార సెల్ఫీ తీసుకున్న ఫోటో అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే మహేష్ బాబుకి సంబంధించిన ఫోటో ఇంకా బయటకి రాలేదు.
అయితే ఈ వేడుకల్లో రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్ కనిపించకపోవడంతో కొంతమంది అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఎందుకు రాలేదని తెగ గాబర పడుతున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ ఎందుకు రాలేదంటే.. తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలను ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు జపాన్ వెళ్లారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్టీఆర్ జపాన్ వెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కారణం వలనే ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి రాలేకపోయారు.
Next Story