Mon Dec 23 2024 11:05:18 GMT+0000 (Coordinated Universal Time)
NTR : ఎన్టీఆర్ అభిమానులను భయపెడుతున్న టైగర్..
వార్ 2 విషయంలో ఎన్టీఆర్ అభిమానులను కొత్తగా ఒక విషయం భయపెడుతుంది. ఏంటది..?
బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్.. టైగర్, పఠాన్, వార్ చిత్రాలతో ఒక స్పై యూనివర్స్ ని క్రియేట్ చేసింది. పఠాన్ చిత్రంతో ఈ యూనివర్స్ కి తెరలేపిన నిర్మాతలు టైగర్ 3లో పఠాన్ అండ్ వార్ క్యారెక్టర్స్ ని చూపించి.. యూనివర్స్ ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇక వార్ 2 సినిమాలో నటిస్తూ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్.. ఈ బాలీవుడ్ స్పై యూనివర్స్ లో భాగం అవుతున్నారు. అయితే ఈ యూనివర్స్ లో ఎన్టీఆర్ హీరోగా కాకుండా విలన్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే, ఇక్కడ ఒక విషయం ఎన్టీఆర్ అభిమానులను భయపెడుతుంది. ఇటీవల ఈ యూనివర్స్ నుంచి టైగర్ 3 సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. యాక్షన్ లవర్స్ ని ఈ చిత్రం నిరాశ పరిచింది అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఇందుకు కారణం దర్శకుడు మనీష్ శర్మకి ఈ చిత్రం ఇవ్వడమే అంటూ నిర్మాతలను నిందిస్తున్నారు.
లవ్ స్టోరీస్ అనుభవం ఉన్న మనీష్ శర్మకి యాక్షన్ సినిమా దర్శకత్వ భాద్యత ఇచ్చి యాష్ రాజ్ ఫిలిమ్స్ తప్పు చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయమే ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అభిమానులను కలవర పెడుతుంది. ఎందుకంటే వార్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న అయాన్ ముఖర్జీ కూడా లవ్ స్టోరీస్ అనుభవం ఉన్న దర్శకుడే. ఇటీవల 'బ్రహ్మాస్త్ర' అంటూ సూపర్ పవర్స్ యాక్షన్ థ్రిల్లర్ తీసినప్పటికి.. అది యాక్షన్ లవర్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో వార్ 2ని ఏం చేస్తారో అని అభిమానులు కొంచెం టెన్షన్ పడుతున్నారు. కాగా టైగర్ 3 ముగింపులో ఒక కొత్త విలన్ గురించి ఆడియన్స్ కి పరిచయం చేశారు. ఆ విలన్ పాత్ర ఎన్టీఆర్దే అంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. అవెంజర్స్ లో 'థానోస్'లా యాష్ స్పై యూనివెర్స్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కి ఎన్టీఆర్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
Next Story