Mon Dec 23 2024 13:52:05 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ దుబాయ్ పయనం..
దేవర మూవీ శరవేగంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్.. ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్ళాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR తరువాత చేస్తున్న సినిమా 'దేవర' (Devara). కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఒక షెడ్యూల్ పూర్తి అయిన తరువాత మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ.. అభిమానులను ఖుషీ చేస్తూ వస్తున్నారు. ఇటీవల చిత్ర యూనిట్ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఈ షెడ్యూల్ పూర్తి చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ పయనం అయ్యాడు.
ఎప్పటిలాగానే SIIMA అవార్డ్స్ ఈ ఏడాది కూడా దుబాయ్ లో జరగనున్నాయి. ఇక RRR చిత్రం అవార్డుల రేసులో ఉన్న ఎన్టీఆర్.. ఆ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్తున్నాడు. ఆ ఈవెంట్ చూసుకొని కొన్ని రోజులు అక్కడే ఫ్యామిలీ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి దేవర తదుపరి షెడ్యూల్ లో పాల్గొనున్నాడు. కాగా ఈ ఏడాది అవార్డు రేసులో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఇక RRR నుంచే ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నాడు. అలాగే పుష్పకి నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ కూడా ఉన్నాడు. మరి ఈసారి SIIMA లో ఎవరు ఏ అవార్డులను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.
ఇక దేవర విషయానికి వస్తే.. కళ్యాణ్ రామ్ ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా VFX అండ్ యాక్షన్ సన్నివేశాలు కోసం హాలీవుడ్ సినిమాలకు పని చేసిన టెక్నీషియన్స్ ని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. మూవీలో చాలా పార్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఉండనుందట. సినిమాకే ఆ సీక్వెన్స్ హైలైట్ కానున్నాయని సమాచారం. ఎన్టీఆర్ ని ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అలాగే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది.
Next Story