Mon Dec 23 2024 10:56:40 GMT+0000 (Coordinated Universal Time)
మొదలైన ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 షూటింగ్.. లీకైన పిక్స్..
స్పెయిన్ లో యాక్షన్ షెడ్యూల్ తో మొదలైన ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 షూటింగ్. నెట్టింట వైరల్ అవుతున్న లీకైన పిక్స్, వీడియోస్..
మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమా 'వార్ 2'. గతంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'వార్'కి ఇది సీక్వెల్ గా రాబోతుంది. అంతేకాదు బాలీవుడ్ స్పై యూనివర్స్ లో భాగంగా టైగర్, పఠాన్ చిత్రాల వరుసలో ఈ మూవీ కూడా తెరకెక్కుతుంది. అయాన్ ముఖర్జీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ ఎలాంటి పాత్రని పోషిస్తున్నాడో తెలియదుగాని ప్రేక్షకుల్లో మాత్రం భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందా అని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ మొదలైంది. స్పెయిన్ లో యాక్షన్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టారు. ఇక అక్కడ అదిరిపోయే కారు ఛేజింగ్ సీక్వెన్స్ ని దర్శకుడు అయాన్ చిత్రీకరిస్తున్నాడు. అయితే ఈ షూటింగ్ లో ఎన్టీఆర్, హృతిక్ జాయిన్ అవ్వలేదు. ప్రస్తుతం వీరిద్దరూ లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.
హృతిక్ రోషన్ త్వరలోనే ఈ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడట. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయ్యిన తరువాతే వార్ 2 సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడని గతంలో వార్తలు వినిపించాయి. అయితే దేవర చిత్రాన్ని ఇప్పుడు రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. దీంతో దేవర షూటింగ్ మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
మరి ఎన్టీఆర్ ఈమద్యలోనే వార్ 2 కి డేట్స్ ఇస్తాడా..? అనేది చూడాలి. ఇది ఇలా ఉంటే, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయాల్సిన మూవీ కూడా వచ్చే ఏడాది సమ్మర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టుకుంటుందని ఇటీవల నిర్మాతలు తెలియజేసారు. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు.
Next Story