Mon Dec 23 2024 15:51:29 GMT+0000 (Coordinated Universal Time)
Devara : దేవర షూటింగ్ అప్డేట్.. మరో రెండు నెలలో..!
దేవర కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలయింది. మరో రెండు నెలలో మొత్తం చిత్రీకరణ..
Devara : కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే మూవీలోని యాక్షన్ పార్ట్ షూట్ అంతా పూర్తి చేసేశారు.
ప్రస్తుతం సినిమాలోని ఎమోషన్, లవ్ మరియు ఇతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల గోవా, గోకర్ణ ప్రాంతంలో ఎన్టీఆర్, జాన్వీ పై ముఖ్యమైన సీన్స్ షూట్ చేశారు. అక్కడ షెడ్యూల్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ దివాళీ హాలిడే గ్యాప్ ఇచ్చారు. ఈ ఫెస్టివల్ బ్రేక్ తరువాత నేడు ఈ మూవీ కొత్త షెడ్యూల్ ని ప్రారంభించినట్లు మూవీ టీం తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు.
ఈ షెడ్యూల్ లో పలు ముఖ్య సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. మూవీలోని ప్రధాన పాత్రలు పోషించేవారు ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారట. కాగా ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కావొచ్చిందట. మరో రెండు నెలలో ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టనున్నారని సమాచారం. ఇదే నిజమైతే.. ఒక పెద్ద పాన్ ఇండియా మూవీ ఇంత ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేయడం గమనార్హం.
ఆడియన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్టీఆర్, కొరటాల పడుతున్న కష్టం.. సినిమా పై వాళ్ళకి ఉన్న కమిట్మెంట్ ని తెలియజేస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా మొదటి పార్ట్ ని 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్, మురళి శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Next Story