Mon Dec 23 2024 16:05:59 GMT+0000 (Coordinated Universal Time)
'దేవర' రెండు భాగాలుగా రావడానికి కారణం ఏంటి..?
ఎన్టీఆర్ 'దేవర' కూడా రెండు భాగాలుగా రాబోతుందట. ఇలా టు పార్ట్స్ గా రావడానికి రీజన్ ఏంటి..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సుమారు 300 కోట్ల బడ్జెట్ ని ఈ సినిమా నిర్మాణం కోసం పెడుతున్నారని సమాచారం. ఇక్కడి టాప్ టెక్నీషియన్స్ తో పాటు హాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలకు వర్క్ చేసిన మేకర్స్ ని కూడా రంగంలోకి దించి దేవరని తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు ఒక పార్ట్ గానే సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నాము అంటూ దర్శకుడు ప్రకటించాడు. మొదటి పార్ట్ ని ముందుగా అనౌన్స్ చేసినట్లు ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామంటూ తెలియజేశాడు. ఇక ఈ వార్తతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే కొరటాల ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి..?
ఇది కూడా కొరటాలే తెలియజేశాడు. షూటింగ్ లోకి వెళ్లిన తరువాత రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యేసరికి.. మూవీ నిడివి పెరుగుతూ వచ్చింది. ప్రతి పాత్ర ఒక్క ఎమోషన్ ని లోతుగా చూపించే ప్రయత్నంలో సినిమా డ్యూరేషన్ పెరుగుతూ వెళ్తుందట. ఒక సీన్ కాదు కదా, ఒక డైలాగ్ ని కట్ చేసినా ఆడియన్స్ కి ఎమోషన్ క్యారీ అవ్వదేమో అని భావించి మూవీని రెండు భాగాలుగా తీసుకు రావాలని నిర్ణయించుకున్నాడు.
కాగా ఈ మూవీ స్టోరీ అంతా.. అభివృద్ధి చెందని ఒక దివిలో జరుగుతుంది. అక్కడ ప్రజలు భయం అనేది తెలియకుండా ఒక మృగాలుగా బ్రతుకుతుంటారు. అలాంటి వారికీ ఎన్టీఆర్ భయాన్ని పరిచయం చేస్తాడని కొరటాల గతంలోనే చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో తండ్రి-కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Next Story